నిరుద్యోగులకు శుభవార్త. కరోనా మహమ్మారి నేపధ్యంలో వివిధ రంగాల్లో కొలువులకు కోత పడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో... టెక్ దిగ్గజాలు చేపట్టిన కొలువుల భర్తీ ప్రక్రియ నిరుద్యోగులకు వెసులుబాటు కల్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఐటీ విభాగంలో దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. భారీ స్థాయిలో కొలువులను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల మంది ఫ్రెషర్స్‌ను క్యాంపస్ నియామకం ద్వారా నియమించనుంది.
గత ఏడాది తొమ్మిది వేల మంది ఉద్యోగులను ఈ సంస్థ నియమించుకుంది. ఈ దఫా అంతకుమించి ఆరు వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనుంది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా క్యాంపస్‌లలో ప్రెషర్ల ఎంపిక ప్రక్రియ కాస్త నెమ్మదించిందని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సుమారు 1000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు తెలిపింది.