Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి పండు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (09:40 IST)
సాధారణంగా చాలామంది పిల్లలు చాక్లెట్లు, ఐస్ క్రీం లాంటివి తినటానికి ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరము. వీటివల్ల తరచుగా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి. కనుక పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి పండ్లను తినటం అలవాటు చేయాలి. ఏ సీజన్‌లో దొరికే పండును ఆ సీజన్లో పిల్లలకు పెట్టడం వల్ల వారికి అన్ని రకాల విటమిన్స్ అందుతాయి. దీనివలన పిల్లలు చదువులోను, ఆట పాటలలోను ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. మరి ముఖ్యంగా బొప్పాయిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.
 
అవి ఏమిటంటే.. బొప్పాయి పండు ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ గృహవైద్యంగా పని చేస్తుంది. ఎలా అంటే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు భారీగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైము బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల భోజనం తర్వాత నాలుగు బొప్పాయి ముక్కలు తింటే అది కడుపులో ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూస్తుంది. ఇది మాంసాన్ని కూడా త్వరగా అరిగేలా చేస్తుంది. బొప్పాయిలో ఎ, బి, సి, ఇ విటమిన్లతో పాటు ఖనిజాలు, ప్లేవనాయిడ్స్ వంటి మరెన్నో పోషకాలు ఉంటాయి. 
 
కొలెస్ట్రాల్‌ని తగ్గించడం ద్వారా ఇది గుండె జబ్బులను నివారిస్తుంది. ఇది నరాల బలహీనతలను తగ్గించే మంచి టానిక్ కూడా. క్యాల్షియం, పాస్ఫరస్ ఐరన్, మెగ్నీషియం, 
 
సోడియం, పొటాషియం, గంధకం, క్లోరిన్ వంటి పోషకాలు తగు మోతాదులో ఉండటం వల్ల బొప్పాయి పలు శారీరక రుగ్మతలకు అడ్డుకట్ట వేయగలుగుతుంది. కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఎ, ఇలు కూడా బొప్పాయిలో ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

Love Story: మహిళకు షాకిచ్చిన యువకుడు.. చివరికి జైలులో చిప్పకూడు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

తర్వాతి కథనం
Show comments