ఎసిడిటీతో తట్టుకోలేనంత ఇబ్బంది పడుతున్నారా?

శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:06 IST)
ఎసిడిటీతో తట్టుకోలేనంత ఇబ్బంది పడుతున్నారా? ఛాతీలో మంట, గొంతులోకి తన్నుకొచ్చే జీర్ణరసాలు, పుల్లని త్రేన్పులు వంటివి ఎసిడిటీ ప్రధాన లక్షణాలు. ఈ ఇబ్బందులను అధికమించాలంటే...
 
*నియమిత ఆహార వేళలు పాటించాలి.
 
*ఎసిడిటీ ఉన్న వారు తేలికగా జీర్ణమయ్యే అన్నం తినాలి. 
 
*తక్కువ పరిమాణాల్లో ఎక్కువ సార్లు తినాలి. 
 
*సమయానికి ఆహారం తినడం మానకూడదు.
 
*పుల్లని, తీపి పదార్థాలు తినకూడదు.
 
*మితిమీరి ఆహారం తీసుకోకూడదు. జీర్ణాశయంలో ఆహారం జీర్ణమయ్యేటంత ఖాళీ వదలాలి. 
 
*తిన్న వెంటనే పడుకోకుండా కనీసం 40 నిమిషాల వరకైనా నిటారుగా నిలబడటం లేదా కూర్చోవడం చేయాలి.
 
*జంక్ ఫుడ్‌లో ఉండే కొవ్వులను అరిగించుకోవడానికి అధక పరిమాణంలో జీర్ణరసాలు ఊరతాయి. కాబట్టి కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఎండుద్రాక్షతో మలబద్దకం నివారణ...