Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-09-2019- బుధవారం దినఫలాలు - అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు...

Advertiesment
Daily Horoscope
, బుధవారం, 11 సెప్టెంబరు 2019 (09:34 IST)
మేషం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించలేరు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల రాక కొంత అసౌకర్యం కలిగిస్తుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. విదేశాలు వెళ్ళటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం: ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. ఖర్చులు సంతృప్తికరంగానూ, ప్రయోజనకరంగానూ ఉంటాయి. సోదరుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలకు పనిభారం అధికం. మీ అతిధి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి.
 
మిధునం: విద్యార్థినులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మీ నేర్పు, ఓర్పులకిది పరీక్షా సమయమని గమనించండి. స్త్రీలు విందులు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. అనుకున్న పనులు ఆశించిన రీతిలోసాగవు. ఖర్చులు అధికంగా ఉంటాయి.  
 
కర్కాటకం: ఆర్థికలావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. గతంలో నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు సజావుగా పూర్తి కాగలవు. మీ సమర్థతను ఎదుటి వారు గుర్తిస్తారు. ఒక వ్యవహారంలో మీరు తీసుకున్న నిర్ణయానికి కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది.
 
సింహం: వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన, చికాకులను కలిగిస్తుంది. పొదుపు చేయాలన్న మీ లక్ష్యం నెరవేరదు. ఉద్యోగస్తులు తోటివారి సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.
 
కన్య: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు వేధింపులు తప్పవు. వాతావరణంలోని మార్పుతో ఆరోగ్యం మందగిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా మాటపడవలసి వస్తుంది.
 
తుల: ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. హామీలు, బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో మెలకువ వహించండి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఏమరుపాటుతనం వల్ల ఇబ్బందులు తప్పవు. 
 
వృశ్చికం: కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రేమికులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకునే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. పత్రికా రంగంలోని వారికి ఆందోళన తప్పదు.
 
ధనస్సు: బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో చికాకులు తప్పవు. వాహనం, విలాస వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు ఆశాజనకం.
 
మకరం: స్త్రీలు ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. రావలసిన ధనం వసూలులో శ్రమ, ప్రయాసలెదుర్కుంటారు. వ్యవసాయ, తోటల రంగాల వారిలో భయాందోళనలు అధికమవుతాయి. మార్కెట్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
కుంభం: వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు ప్రగతి పథంలో సాగుతాయి. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. హామీలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
మీనం: కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. ఏజెంట్లు, బ్రోకర్లను శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు ఊహించినవి కావటంతో ఇబ్బందులు అంతగా ఉండవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-09-2019- మంగళవారం దినఫలాలు - స్త్రీలకు పనివారితో...