Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు, ఉసిరిక చూర్ణం రెండూ కలిపి తీసుకుంటే?

భారతీయ సంస్కృతిలో శుభప్రదంగా, మంగళకరంగా భావించే వాటిల్లో పసుపు అత్యంత ప్రధానమైనది. అంతేకాక దీన్ని ఆహారంలో రంగు, రుచి, వాసన కొరకు వాడడంతో పాటు పూర్వకాలం నుండి పసుపును ఔషధంగా ఉపయోగిస్తారు. పూర్వకాలం నుండి ప్రతి ఇంటి గడపలకు పసుపు రాయడం ఆచారం. తద్వారా క్

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (21:50 IST)
భారతీయ సంస్కృతిలో శుభప్రదంగా, మంగళకరంగా భావించే వాటిల్లో పసుపు అత్యంత ప్రధానమైనది. అంతేకాక దీన్ని ఆహారంలో రంగు, రుచి, వాసన కొరకు వాడడంతో పాటు పూర్వకాలం నుండి పసుపును ఔషధంగా ఉపయోగిస్తారు. పూర్వకాలం నుండి ప్రతి ఇంటి గడపలకు పసుపు రాయడం ఆచారం. తద్వారా క్రిములు, కీటకాలు లాంటివి ఇంటిలోకి ప్రవేశించవనే అభిప్రాయం ఆ ఆచారం వెనుక దాగి ఉన్న వైజ్ఞానిక సత్యం. ఇంటిలోను, బావులు మొదలగు తేమ ప్రాంతాల్లో పని చేసే స్త్రీల పాదాలకు క్రిములు సంక్రమించకుండా పసుపు రాసుకునేవారు. పసుపు వల్ల మన ఆరోగ్యానికి జరిగే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం....
 
1. గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపుపొడి, కొంచెం మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని వేడి చేసి ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగడం వల్ల జలుబు, తుమ్ములు దగ్గు లాంటివి నివారింపబడతాయి. 
 
2. పసుపు, ఉసిరిక చూర్ణం ఈ రెండింటిని రెండు గ్రాముల చొప్పున తీసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. 
 
3. పసుపు సౌందర్య సాధనం కూడా. పసుపు, చందనం రెండింటిని పాలమీగడతో కలిపి ముఖానికి రాసుకోవాలి. అర్థగంట తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖ వర్చస్సు పెరుగుతుంది.
 
4. ఇస్నోఫీలియా వ్యాధిలో పసుపు గుణం అపారం. అరచెంచా పసుపులో మూడు చెంచాల స్వచ్చమైన తేనె వేసి రోజుకి మూడు సార్లు చొప్పున నాలుగు నెలల పాటు తీసుకుంటే ఆ వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
 
5. ముక్కలుగా కొట్టిన పసుపుకొమ్ములు, గోధుమలు సమంగా తీసుకుని దోరగా వేయించి దంచిన చూర్ణాన్ని జల్లించి ఉంచుకుని, రోజూ మూడుపూటలా ఆహారానికి అర్థగంట ముందు పావు స్పూను పొడిని అరగ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి తాగడం వల్ల ఉబ్బసం వ్యాధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా తుమ్ములు, జలుబు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

Jagan Birthday: జగన్‌కు నాగబాబు, చంద్రబాబుల పుట్టినరోజు శుభాకాంక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

తర్వాతి కథనం
Show comments