Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

వేసవిలో కూల్ ప్యాక్స్.. నిమ్మరసానికి కలబంద గుజ్జు తోడైతే?

వేసవిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎండ ప్రభావాన్ని భరించక తప్పదు. ముఖ్యంగా చర్మం ఎండకు కమిలిపోయి నల్లబారుతుంది. ఈ సమస్యలకు గురికాకుండా తప్పించుకోవటం అసాధ్యం. కాబట్టి పాడైన చర్మానికి ఫేస్ ప్యాక్స్‌తో సంరక్షి

Advertiesment
Summer
, మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (17:45 IST)
వేసవిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎండ ప్రభావాన్ని భరించక తప్పదు. ముఖ్యంగా చర్మం ఎండకు కమిలిపోయి నల్లబారుతుంది. ఈ సమస్యలకు గురికాకుండా తప్పించుకోవటం అసాధ్యం. కాబట్టి పాడైన చర్మానికి ఫేస్ ప్యాక్స్‌తో సంరక్షించుకోవాలి. ఇందుకోసం ఈ సమ్మర్ ప్యాక్స్‌ను ఇంట్లోనే ట్రై చేయండి.
 
నిమ్మతో చర్మానికి వేసవిలో మేలు చేయొచ్చు. నిమ్మకు కలబంద తోడైతే మెరిసే సౌందర్యం మీ సొంతం అవుతుంది. నిమ్మ.. కలబంద ప్యాక్ ఎలా తయారు చేయాలంటే.. నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్. చర్మానికి హాని కలగకుండా మెరుపు తీసుకురావటంలో నిమ్మకు మించిన ఔషదం లేదు. కలబందకు చర్మం మీది బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములను నశింపచేసే గుణం వుంటుంది.
 
నిమ్మరసం పావు కప్పు, కలబంద గుజ్జు ఓ స్పూన్ చేర్చి.. బాగా కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే కలబంద గుజ్జులో నిమ్మరసం కలిపి ముఖానికి, చేతులకు రాసుకొని పూర్తిగా ఆరాక కడిగేసుకోవాలి. ఇలా రోజుకి రెండు,మూడు సార్లు చేసినటైతే చర్మం శుభ్రంగా వుండటంతో పాటు మృదువుగా తయారవుతుంది.
 
ఇకపోతే.. పసుపు, పెరుగు, తేనె కూడా చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. పసుపు క్రిమిసంహారిణి, తేనె, పెరుగు సహజమైన మాయిశ్చర్తెజర్లుగా పనిచేస్తాయి. ఎండతో పొడిబారిన చర్మాన్ని తేమగా మార్చుకోవాలంటే.. ఈ మూడింటిని కలిపి ప్యాక్ వేసుకొని పది నిమిషాలు తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేసినట్లైతే చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుందని బ్యూటీషియన్లు సలహా ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యారెట్ హల్వా ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి? (VIDEO)