Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమ్మడి చేసే మేలు... స్త్రీలకు, పురుషులకు...

తెలుగువారి యింటి ముంగిట గుమ్మడిపండును వ్రేలాడదీయడం మనం నిత్యం చూస్తాము. బూడిదగుమ్మడిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడి కూరగాను వడియాలు గాను వాడతాము. కడుపులో మంటగాని, ఉబ్బరంగాని, అతిదాహం ఉన్నప్పుడు బూడిదగుమ్మడిని తినడం వలన గ్యాస్ ట్రబుల్ నివారించవచ్

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (21:36 IST)
తెలుగువారి యింటి ముంగిట గుమ్మడిపండును వ్రేలాడదీయడం మనం నిత్యం చూస్తాము. బూడిదగుమ్మడిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడి కూరగాను వడియాలు గాను వాడతాము. కడుపులో మంటగాని, ఉబ్బరంగాని, అతిదాహం ఉన్నప్పుడు బూడిదగుమ్మడిని తినడం వలన గ్యాస్ ట్రబుల్ నివారించవచ్చు. కడుపులో ఏలికపాములు వున్నప్పుడు గుమ్మడి గింజలను ఎండబెట్టి ఆ తరువాత దోరగా వేయించి, మెత్తగా దంచి ఉప్పు, కారం తగినంత కలుపుకొని తినవచ్చు అలా వాడితే కడుపులోని పురుగులు పడిపోతాయి.
 
బూడిదగుమ్మడి రక్తపుష్టిని కలిగిస్తుంది. గర్భాశయ వ్యాధులతో బాధపడే స్త్రీలకు ఇది చలవ చేసి రక్తపుష్టిని కలిగించడానికి దోహదపడుతుంది. బూడిదగుమ్మడి లివర్ వ్యాధులన్నింటిలోను అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో తీవ్రతను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులలో, టి.బి. వ్యాధిలోను నిస్సత్తువను పోగొడుతుంది. ఊపిరితిత్తులకు బలాన్ని యిస్తుంది. బూడిద గుమ్మడి మూత్రవ్యాధులలో చక్కగా పనిచేస్తుంది. మూత్రంలో మంటను చీము దోషమును తగ్గిస్తుంది.
 
మొలలు వ్యాధిలో రక్తం పడుతున్న సందర్భంలో బూడిదగుమ్మడి తీసుకుంటే రక్తం పడటం ఆగుతుంది. మొలల వ్యాధితో బాధపడేవారు తమ చికిత్సలో బూడిదగుమ్మడి కూడా చేర్చితే వ్యాధి త్వరగా తగ్గుతుంది. బూడిద గుమ్మడి మెదడుకు చలువ చేస్తుంది. పిల్లలకు హల్వాలా తయారుచేసి పెడితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడి బాధపడుతున్నవారు బూడిదగుమ్మడి కాయతో మినపప్పు బదులుగా ఉలవలుతో వడియాలు పట్టుకుని తింటే మూత్రపిండాలలో రాళ్ళు కరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments