Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిస్తా పప్పు చెడు కొలెస్ట్రాల్‌ను ఏం చేస్తుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (22:21 IST)
పిస్తాపప్పు శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలస్ట్రాల్‌ని పెరిగేలా చేస్తుంది. అందువల్ల గుండె జబ్బుల సమస్యలు తగ్గుతాయి. ఇది నరాల వ్యవస్థను బలోపేతం చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
 
పిస్తాపప్పు శరీరంలోని ఊపిరితిత్తులకు మరియు ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది.
 
ఈ పప్పులో పీచు పదార్థం సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు పిస్తా పప్పును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
రోజూ పిస్తాను తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. అంతేకాకుండా కంటి సమస్యలతో బాధపడేవారికి పిస్తా మంచి ఫలితాన్నిస్తుంది. ఇందులోని కెరోటినాయిడ్లు కంటిలోని కణాలను పునరుద్ధరించి కంటిచూపు స్పష్టంగా ఉండేలా చేస్తాయి.
 
ఇందులో ఉండే విటమిన్ ఎ మరియు విటమిన్ బి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర  పోషిస్తాయి. ఇది శరీరాన్ని అనేక శారీరక రుగ్మతల నుండి దూరం చేస్తుంది. శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. శరీరంలోన ఏర్పడే ఫ్రీరాడికల్స్ నుండి రక్షిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

తర్వాతి కథనం
Show comments