Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను పుక్కిలిస్తే ఏం జరుగుతుంది?

Webdunia
బుధవారం, 17 జులై 2019 (19:36 IST)
నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని పైటేట్ అనే యాంటీ ఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్ ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వుల్లోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
 
1. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. అంతేకాకుండా మధుమేహం, బీపీ లను నివారిస్తుంది.
 
2. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడతాయి. ఆస్టియోపోరోసిస్‌ని తగ్గిస్తాయి. వీటిని తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
 
3. వీటిల్లో అధిక మోతాదులో ఉండే కాపర్, కీళ్లు, కండరాల నొప్పుల్నీ మంటల్ని తగ్గించడంతో పాటు శరీరమంతా ఆక్సిజన్ సరఫరాకు తోడ్పడుతుంది.
 
4. నువ్వుల్లోని సెసమాల్ అనే కర్బన పదార్థం, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో రేడియేషన్ కారణంగా కణాల్లోని డిఎన్ఎ దెబ్బ తినకుండా కాపాడుతుంది. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఆస్త్మా రోగుల్లో శ్లేష్మాన్ని హరిస్తాయి. నిద్రలేమిని తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
 
5. పాలిచ్చే తల్లులకు రోజూ కొంచెం నువ్వులు పెడితే పాలు పడతాయి. ప్రతిరోజూ ఒక నువ్వుల ఉండ తినడం వలన శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది.
 
6. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి నువ్వులు మంచి ఔషధంలా పని చేస్తాయని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. నువ్వులనూనెను ఒంటికి మర్దనా చేసుకోవడం వలన కూడా కీళ్లనొప్పులు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments