రోజూ ఒక చిన్నఉల్లిపాయను నములుతూ వస్తే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా వుండదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రోజూ చిన్న ఉల్లిని ఆహారంలో చేర్చుకుంటే.. అనారోగ్య సమస్యలంటూ ఉత్పన్నం కావు. జలుబు చేసిందా లేకుంటే గుండె దడ ఏర్పడినట్లైతే.. ఓ చిన్న ఉల్లిని నమిలి మింగేసి గ్లాసుడు నీళ్లు సేవిస్తే సరిపోతుంది. గుండెదడ, జలుబు, తుమ్ములు మాయమవుతాయి.
ముఖ్యంగా హృద్రోగ వ్యాధిగ్రస్థులకు గుండె దడ ఏర్పడినట్లైతే.. ప్రథమ చికిత్సగా ఉల్లిని నమిలి మింగి, గ్లాసుడు నీరు సేవించడం చేస్తే ఉపశమనం లభిస్తుంది. అలాగే చిన్నఉల్లిపాయల తరుగును నువ్వుల నూనెలో దోరగా వేపుకుని వేడి వేడి అన్నంలోకి కలుపుకుని తింటే రక్తపోటు తగ్గుతుంది. గుండె బలపడుతుంది. మెదడు సంబంధిత రోగాలను దూరం చేసుకోవాలంటే.. తప్పకుండా చిన్నఉల్లిని వాడాల్సిందేనని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే మజ్జిగలో చిన్నఉల్లిపాయ తరుగును చేర్చి తీసుకుంటే హృద్రోగాలను దూరం చేసుకోవచ్చు. ఉదర సంబంధిత రుగ్మతలకు చెక్ పెట్టవచ్చు. చిన్నఉల్లిలో కొవ్వుశాతం తక్కువ. అందుచేత చిన్న ఉల్లిని బరువు తగ్గాలనుకునేవారు వాడవచ్చు.
మహిళల్లో ఏర్పడే రుతుక్రమ సమస్యలను తొలగించాలంటే రోజుకు రెండు బుల్లిఉల్లిపాయల్ని తీసుకోవాలి. ఈ బుల్లిఉల్లి రసం ఒబిసిటీని దూరం చేస్తుంది. ఉల్లిని నేతిలో దోరగా వేయించి పరగడుపున తీసుకుంటే నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.