Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వుల నూనెకు కలబంద గుజ్జు చేర్చి..?

Advertiesment
Sesame Oil
, గురువారం, 25 ఏప్రియల్ 2019 (11:08 IST)
నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. చర్మం అందానికి, జుట్టు సంరక్షణకు కూడా అంతే మేలు చేస్తుంది. నువ్వుల నూనెను వంటల్లోనే కాదు కేశ సంరక్షణలోనూ వాడొచ్చును. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. నువ్వుల నూనె వెంట్రుకలకు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
 
తరచు జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు.. నువ్వుల నూనెను వెంట్రుకలకు రాసుకుంటే.. కుదుళ్లకు కావలసిన పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. కుదుళ్లను బలంగా చేస్తాయి. సగం కప్పు వేడిచేసిన నువ్వుల నూనెను తలకు పట్టించి మర్దన చేసుకోవాలి. రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
 
నువ్వుల నూనె మంచి హెయిర్ కండీషనర్‌గా పనిచేస్తుంది. వెంట్రుకలు చిట్లిపోవడాన్ని నిరోధించి, జీవం కోల్పోయిన వెంట్రుకలను ఆరోగ్యంగా చేస్తుంది. నూరి ముద్ద చేసుకున్న సగం కప్పు నువ్వులకు రెండు స్పూన్ల యోగర్ట్, స్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రులకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత షాంపూలతో తలస్నానం చేయాలి. 
 
నువ్వుల నూనెలో యాంటీ ఫంగల్, వాపు తగ్గించే గుణాలు ఉంటాయి. నువ్వుల నూనె రాసుకుంటే మాడు మీదు కురుపులు పోయి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 2 స్పూన్ల నువ్వుల నూనెకు, స్పూన్ కలబంద గుజ్జు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మర్దన చేసుకోవాలి. ఆరిన తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఆరు ఆహారాలు తింటే.. బరువు పెరగరట..?