Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నక్షత్ర హోటల్స్‌కు బాంబులు చేరవేసిన శ్రీలంక పారిశ్రామికవేత్త కుమారులు

నక్షత్ర హోటల్స్‌కు బాంబులు చేరవేసిన శ్రీలంక పారిశ్రామికవేత్త కుమారులు
, గురువారం, 25 ఏప్రియల్ 2019 (10:52 IST)
ఈస్టర్ సండే రోజున శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ దర్యాప్తును శ్రీలంక భద్రతా బలగాలు ముమ్మరం చేసింది. ఈ విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మారణహోమానికి పాల్పడిన ఆత్మాహుతి సభ్యుల్లో ఇద్దరు ఆ దేశ పారిశ్రామికవేత్తకు చెందిన ఇద్దరు కుమారులుగా తేలింది. 
 
ఈస్టర్ సండే రోజున కొలంబోలోని చర్చిలు, స్టార్ హోటళ్ళలో పేలుళ్ళకు పాల్పడిన దుండగుల్లో ఆ దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారి మహ్మద్ యూసుఫ్ ఇబ్రహీం కుమారులు ఇమ్సాత్ అహ్మద్ ఇబ్రహీం (33), ఇల్హాం అహ్మద్ ఇబ్రహీం (31) అనే ఇద్దరు ఉన్నట్టు తేలింది. యూసుఫ్ ఇబ్రహీం శ్రీలంకలో మసాల దినుసుల వ్యాపార దిగ్గజంగా ఉన్న విషయంతెల్సిందే. 
 
ఈ ఇద్దరు అన్నదమ్ములు స్టార్ హోటళ్ళలోకి బ్యాగుల్లో బాంబులు చేరవేశారు. ముఖ్యంగా, కొలంబోలోని సిన్నమన్‌ గ్రాండ్‌, షాంగ్రీ లా హోటళ్లలో పేలిన బాంబులు వీరిద్దరూ చేరవేసినట్టు సమాచారం. అయితే, వీరిద్దరూ సజీవంగా ఉన్నారా లేదా అన్నది ఇపుడు తెలియాల్సివుంది. 
 
ఈ దర్యాప్తులో వీరిద్దరి పేర్లు బయటకురాగనే, యూసుఫ్ సహా ఆయన మూడో కుమారుడైన ఇజాస్‌ అహ్మద్‌ ఇబ్రహీం (30)ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాంబు పేలుళ్లు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ప్రకటించిన గంటల వ్యవధిలోనే యూసుఫ్ కుమారులకు సంబంధం ఉందనే విషయం బయటపడి సంచలనమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో కొనసాగుతున్న విద్యార్థినిల ఆత్మహత్యలు