ఇవి తీసుకుంటే పళ్లు మిలమిల, నోటి దుర్వాసనకు చెక్

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (23:34 IST)
ఆరోగ్యానికి ఆయుర్వేదంలో ఎన్నో మూలికలు వున్నాయి. వాటిలో జాజికాయ కూడా ఒకటి. తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది. పంటిమీద నలుపునూ, గారను తొలగించి, పళ్ళు మెరిసేలా చేస్తుంది. 
 
పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో, చాలా స్వల్ప పరిమాణంలో ఈ పొడిని కలుపుకుని తాగితే చర్మ కాంతి పెరగడమే కాకుండా, చర్మం ముడతలు పడవు. అధిక దాహాన్ని అరికడుతుంది. దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది. 
 
కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి నీళ్లు లేదా తేనె కలిపి పేస్ట్‌లాగా తయారు చేయాలి. దీన్ని ముఖానికి స్క్రబ్‌లా రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే కొన్ని రోజులకు చర్మం కాంతివంతమవడంతో పాటు చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే, కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. 
 
ఈ కాయలో లభించే 'మిరిస్టిసిన్' అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. అంతేకాక అల్జీమర్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేయడానికి జాజికాయ ఉపకరిస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి పూర్తిగా తొలగించే శక్తి జాజికాయకు ఉంటుంది.
 
అలాగే ఇది మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించడంతో పాటు ఈ రెండు వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. మోతాదుకు మించి జాజికాయను ఉపయోగించడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలతో పాటు ఏకాగ్రత కోల్పోవడం, ఎక్కువ చెమట పట్టడం.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి జాజికాయ వాడకం విషయంలో కాస్త జాగ్రత్త వహించడం ముఖ్యం. గర్భవతులు దీన్ని ఉపయోగించకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పుగా రూ.5 లక్షలు ఇవ్వలేదు.. అంతే మామను హత్య చేసిన వ్యక్తి

మరో ఆరుగురుని బలి తీసుకున్న శంషాబాద్ ఓఆర్ఆర్, కారు అతివేగమే కారణం

నేనే సీఎం, మీరే మంత్రులు: ఎమ్మెల్యే అభ్యర్థులతో టీవీకె విజయ్

భర్త ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల్లోనే ప్రియుడిని పెళ్లాడిన మహిళ

కారును ఎత్తెత్తి పడేసిన ఏనుగు, ఒకరు మృతి, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin: సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్ కాంబినేషన్ చిత్రానికి టైటిల్ సింగ్ గీతం ఖరారు

Thiruveer: కార్మిక లోకానికి సెల్యూట్ చేస్తూ తిరువీర్.. భగవంతుడు మూవీ నుంచి సాంగ్ రిలీజ్

Balakrishna: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ చిత్రం ప్రకటన

Peddi Update: పెద్ది పై ప్రేమ ఎంతుందో జూన్ 4న చూడండి : బుచ్చిబాబు సాన

Rakul Preet Singh: నాకు ఆయనే అతిపెద్ద అండగా నిలిచారని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడి

తర్వాతి కథనం
Show comments