నేరేడు పళ్లు వచ్చేసాయి, వాటిని తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
బుధవారం, 21 జులై 2021 (21:37 IST)
వర్షాకాలం రాగానే కొన్ని సీజనల్ పండ్లు మార్కెట్లో దర్శనమిస్తాయి. వేసవిలో వచ్చిన మామిడిపళ్లు మెల్లగా మాయమవ్వగా ఇప్పుడు నేరేడు పండ్లు వచ్చేసాయి. ఈ నేరేడు ఆకులు లేదా గింజల్ని ఎండబెట్టి పొడి చేసి రోజూ ఓ టీ స్పూన్ మేర తేనెతో కలిపి తీసుకుంటే మధుమేహంతో ఇబ్బందిపడే వారికే కాదు.. అందరికీ మేలు జరుగుతుంది. 
 
పొడిని నీళ్లలో వేసి మరిగించి కషాయం రూపంలో సేవిస్తే మధుమేహులకి మరీ మంచిది. ముఖ్యంగా గింజల్లోని గ్లైకోసైడ్‌ పిండిపదార్థాల్ని చక్కెరలుగా మారకుండా అడ్డుకుంటుంది. పైగా క్లోమగ్రంథుల నుంచి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచే గుణాలూ ఈ గింజల్లో ఉన్నాయి. ఈ పొడి అతి దాహాన్నీ తగ్గిస్తుంది.
 
కాబట్టి నేరేడు పండ్లు తిని గింజల్ని పారేయకండి. ఎండబెట్టి పొడి చేసి వాడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు 
 
ఇక నేరేడు పండు మంచి మౌత్‌ ఫ్రెష్‌నర్‌‌గా పనిచేస్తుంది. చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. ఇందులో వుండే ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడటం ద్వారా కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

US Supermarket: భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు

అక్రమ వలసదారులకు బెంగాల్ సీఎం వార్నింగ్... వెళ్లిపోతారా.. వెళ్లగొట్టమంటారా?

బక్రీద్ పండుగ.. డిజిటల్ చెల్లింపుల ముసుగులో మోసం జాగ్రత్త.. సజ్జనార్

ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడిన ఎయిరిండియా బస్సు

మీనాక్షి అమ్మవారి ఆలయ కార్ పార్కింగ్‌ వద్ద 17ఏళ్ల బాలుడి హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments