వారానికి 5 వెల్లుల్లిపాయలను పచ్చివి తినటం వలన కేన్సర్ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకు నిర్మూలించవచ్చట. కనుక దీనిని సర్వరోగ నివారిణి అనవచ్చు.
వెల్లుల్లిలో ధయమిన్ లోపాన్ని తగ్గించి అభివృద్ది చేసే గుణం కూడా పుష్కలంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన నోటి వ్యాధులకు దివ్యఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లిని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల బరువును కూడా తగ్గించుకోవచ్చు.
వెల్లుల్లి మన శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ప్లమేటర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలు వివిధ రకాల అలర్జీల బారిన పడకుండా మన శరీరాన్ని రక్షిస్తుంది. వెల్లుల్లిని ప్రతిరోజు తీసుకోవడం వలన కీళ్లవాపు నివారించబడుతుంది. పచ్చి వెల్లుల్లి రసం దద్దుర్లు, కీటక కాటు వలన ఏర్పడిన దురదను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
వెల్లుల్లిని ప్రతిరోజు ఉపయోగించడం వలన తరచూ వచ్చే జలుబుకు ఉపశమనం కలుగుతుంది. ఆస్త్మా, శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలు తగ్గించడానికి వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. వెల్లుల్లి ఇన్సులిన్‌ను పెంచుతుంది. మధుమేహగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వెల్లుల్లి గుజ్జును లేదా వెల్లుల్లిని ఉడికించిన నీటిని మెుటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మెుటిమలు మరియు మచ్చలను సమర్ధవంతంగా నివారిస్తుంది.