Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం వండిన తర్వాత గంజిని పడేస్తున్నారా?

Webdunia
బుధవారం, 21 జులై 2021 (19:00 IST)
రైస్ కుక్కర్లు రాకముందు ప్రతి ఇంట్లో అన్నం వండి వార్చేవారు.. అలా అన్నం వార్చే సమయంలో వచ్చిన గంజిని కొంతమంది పెద్దలు ఉప్పు , నిమ్మరసం, బెల్లం ముక్క , పచ్చి మిర్చి టెస్టుకు తగినట్లుగా ఏదోకటి కలిపి వేడి వేడిగా తాగేవారు.
అప్పుడు గంజిలో ఉన్న పోషకాలు శరీరానికి అందేవి.. దాహం తీరేది. అయితే కాలంతో పాటే వచ్చిన మార్పుల్లో భాగంగా తినే తిండిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. గంజిని పక్కన పెట్టి.. టీ, కాఫీలు చేరాయి. ఇప్పుడు గంజిని వృథాగా పడేస్తున్నారు.

అయితే పోషకాహార నిపుణులు గంజితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని.. పడేసే ముందు ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నారు. ఈరోజు గంజిలో ఉన్న పోషకాలను గురించి తెలుసుకుందాం..

గంజి తాగడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది.
శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
జ్వరంతో ఉన్నవారు గంజి తాగితే.. శక్తి వస్తుంది. జ్వరం తగ్గుముఖం పడుతుంది.
గంజిలో ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉన్నాయి.
కడుపులో మంటతో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం
గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిస్తాయి.
జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
వాంతులు, విరేచనాలతో బాధపడేవారు గంజిని తాగితే శరీరానికి పోషకాలు అందుతాయి.
ఇది డయేరియాను తగ్గించడమే కాకుండా ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గంజితో ఆరోగ్యాన్ని కాదు.. అందాన్నీ కూడా పెంచుకోవచ్చు :
చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచేందుకు గంజి సహాయపడుతుంది.
చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.
ఈ గంజిని తలకు పట్టిస్తే.. జుట్టు పట్టులా మెరుస్తుంది.
జుట్టు రాలడం తగ్గుతుంది.
జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments