Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేకింగ్ సోడాతో చుండ్రును వదిలించుకోవచ్చా? ఎలా?

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (20:48 IST)
చుండ్రు అనేది మనలో చాలా మంది ఎదుర్కొనే, ఒక సాధారణ సమస్య. పొడిబారి, పొలుసులుగా మారిన చర్మం చుండ్రు ఏర్పడటానికి దారితీస్తుంది. ప్రారంభ దశలలో చుండ్రు నివారణకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, జుట్టు రాలడం, మాడుపై దురద మరియు అంటువ్యాధులు సోకడం వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది. అయినా కాని, మీరు చింతించాల్సిన అవసరం లేదు. దీనికి సులభమైన పరిష్కారం సహజ పదార్థం రూపంలో మన వంటగదిలోనే ఉంది. 
 
అది వేరేదో కాదు.. బేకింగ్ సోడా. బేకింగ్ సోడాను కేశసంరక్షణ ఉత్పత్తుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. దీనిలోని యాంటీసెప్టిక్ లక్షణాలు, చుండ్రును కలిగించే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఇది మాడు మీద చర్మం యొక్క పిహెచ్ సమతుల్యతను కాపాడి, సహజ తేమను నిలబెట్టడంలో సహాయపడుతుంది.
 
1. రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం, ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను కలిపి పేస్టు చేయండి. నెమ్మదిగా ఈ మిశ్రమాన్ని ఉపయోగించి, మాడుపై మర్దన చేసుకుని, కొన్ని నిముషాల పాటు వదిలివేయండి. కొన్ని నిముషాల తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు.
 
2. రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్  పదార్ధాలనన్నింటిని చక్కగా కలపండి. ఆ మిశ్రమాన్ని మాడుపై శుభ్రంగా రాసుకుని 5-10 నిముషాల పాటు వదిలివేయండి.  తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. 
 
3. ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె , ఒక టేబుల్ స్పూన్ తేనెను తీసుకొని  కొబ్బరి నూనెలో తేనె, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. తలపై, ఈ మిశ్రమాన్ని రాసుకుని, 20-30 నిముషాల పాటు ఆరనీయండి.  తరువాత సాధారణ నీటిని ఉపయోగించి శుభ్రం చేసుకోండి. 
 
4. మంచి ఫలితాల కొరకు, ఈ మాస్కును వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. ఈ నివారణలు త్వరగా ఫలితం చూపించవు. ఫలితం పొందటానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల, మీరు తేడాను గమనించే వరకు, ఈ నివారణలను క్రమం తప్పకుండా ఉపయోగించడం మంచిది.

సంబంధిత వార్తలు

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments