మనకు గొంతు నొప్పి సమస్య సాధారణంగా వస్తూనే ఉంటుంది. ఇక సీజన్ మారినప్పుడు కూడా గొంతు నొప్పి వచ్చి మనల్ని చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తుంది. గొంతులో నొప్పిగా ఉండడం, ఇన్‌ఫెక్షన్, మంట, సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలను మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి గొంతు నొప్పిని ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతో పోగొట్టుకోవచ్చు. 
	
 
									
										
								
																	
	 
	ఇందుకోసం ఆంగ్ల ఔషధాలను ఉపయోగించాల్సిన పని లేదు. ఈ క్రమంలో గొంతు నొప్పిని ఎఫెక్టివ్‌గా తగ్గించుకునేందుకు ఏం చేయాలో, ఏయే పదార్థాలను తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	* గొంతు నొప్పి, ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉంటే వేడిగా ఉండే చికెన్ సూప్ తాగాలి. ఆయా సమస్యలకు చికెన్ సూప్ ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు ఒకవేళ జలుబు ఉన్నా కూడా పోతుంది.
 
									
										
								
																	
	 
	* ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్కలను వేసి, ఆ నీటిని బాగా మరిగించాలి. అలా చిక్కని అల్లం రసం వచ్చిన తర్వాత ఆ రసాన్ని వడకట్టి వేడిగా ఉండగానే తాగాలి. దీంతో గొంతు నొప్పి క్షణాల్లో తగ్గుతుంది.
 
									
											
									
			        							
								
																	
	 
	* మిరియాలతో చేసిన రసం లేదంటే మిరియాలు వేసి మరిగించిన పాలను తాగుతుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా నయమవుతాయి.
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనెలను కలుపుకుని తాగాలి. వీటిలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. ఇన్‌ఫెక్షన్లను పోగొడతాయి. జలుబు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	* లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వంటి పదార్థాలను వేసి టీ తయారు చేసుకుని వేడిగా తాగాలి. ఇలా తయారు చేసిన మసాలా టీ తాగడం వల్ల గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.