Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్తిమీరను కూరల్లో చేర్చుకుంటే.. కొలెస్ట్రాల్ పరార్

కొత్తిమీరను కూరల్లో చేర్చుకుంటే.. కొలెస్ట్రాల్ పరార్
, శుక్రవారం, 29 మార్చి 2019 (15:58 IST)
వంటకాలలో రుచి కోసం, వాసన కోసం, గార్నిష్ కోసం మనం సాధారణంగా కొత్తిమిరను వాడుతుంటాం. రసంతో చాలా మంది తూచా తప్పకుండా ఉపయోగిస్తారు. కొంత మంది పచ్చడి చేసుకుని తింటారు. ఇలా పలు రకాలుగా మనం కొత్తిమిరను ఆహారంలో భాగం చేసుకున్నాం. అయితే కొత్తిమిరను తినడం వలన కలిగే ప్రయోజనాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 
 
కొత్తిమిరలో యాంటీ-ఆక్సిడేంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తాయి. కొత్తిమిర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతాయి. చర్మ రక్షణ కోసం వాడే రసాయనిక మందులలో కొత్తిమిర ఆకులను వాడతారు. 
 
ముఖం పైన వచ్చే మొటిమలను నివారించడానికి, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గించటంలో కొత్తిమిర ప్రధానపాత్ర పోషిస్తుంది. ఎముకలను బలంగా ఉంచడానికి కావలసిన విటమిన్ కే కొత్తిమిరలో పుష్కలంగా ఉంటుంది. జింక్, కాపర్, పొటాషియం వంటి మినరల్స్ కూడా కొత్తిమిరలో అధికంగా ఉంటాయి. కొత్తిమిర ఆహారానికి రుచి ఇవ్వడమే కాకుండా, జీర్ణక్రియ స్థాయిని కూడా పెంచుతుంది. 
 
అంతేకాకుండా, వాంతులు వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. కొత్తిమిరలో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్‌ కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఆపుతాయి. కొత్తిమిరను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవటం వలన కిడ్నీలలో వచ్చే రాళ్లను నివారించుకోవచ్చు. 
 
అదేవిధంగా పిల్లలు మరియు పెద్దల్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ను నివారించుకోవచ్చు. కొత్తిమిర రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాదు ఇది బ్లడ్ బిల్డర్ కూడా. కొత్తిమిరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య రాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్వరం వచ్చిన వాళ్ళకి పెసరకట్టు ఎంతో మంచిదండోయ్..