Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసిడిటీ నుంచి తప్పించుకోవాలంటే..? ఈ చిట్కాలు పాటించండి..

అసిడిటీ నుంచి తప్పించుకోవాలంటే..? ఈ చిట్కాలు పాటించండి..
, శుక్రవారం, 29 మార్చి 2019 (18:14 IST)
అజీర్తి, అసిడిటీ, కడుపునొప్పితో బాధపడేవారు చాలా మంది ఉంటారు. అసిడిటీ కారణంగా గుండెలో మంట కూడా వస్తుంది. ఆహారం జీర్ణం కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అవి మనం తీసుకునే ఆహారం, సమయంపై ఆధారపడి ఉంటాయి. వేళ తప్పించి భోజనం చేయడం, మద్యపానం, ధూమపానం, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య వస్తుంటుంది. 
 
మనం జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒక వేళ మీరు ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కాలను పాటించండి. వెంటనే ఉపశమనం పొందవచ్చు. అల్లం అజీర్ణ సమస్యకు చక్కని మందు. ఓ గ్లాసు నీళ్లలో కొన్ని తురిమిన అల్లం ముక్కలు వేసి బాగా వేడిచేయండి. ఆ తర్వాత వడపోసి ఆ నీటిని చల్లారక ముందే త్రాగేయండి. 
 
అప్పుడు ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. లేదా అల్లం ముక్కలను దంచి ఆ రసాన్ని సేకరించి త్రాగినా మంచి ప్రయోజనం ఉంటుంది. మీ కోసం మరో సులభమైన చిట్కా ఉంది. ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి తాగితే, తక్షణమే ఉపశమనం పొందవచ్చు. నీటికి బదులుగా తేనె, నిమ్మరసాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తాగితే అజీర్ణ సమస్య దూరమవుతుంది. 
 
ఒక గ్లాస్ నీటిలో కొన్ని సోంపు గింజలను వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వేడిగా తాగితే మంచిది. ద్రవ రూపంలో కాకుండా ఘన రూపంలో తీసుకోవాలంటే, గుప్పెడు వాము తీసుకుని అందులో కొంత ఉప్పు వేసి బాగా నలిపి ఆ మిశ్రమాన్ని తినండి. వెంటనే నీరు తాగాలి. దీంతో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం తగ్గుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లవంగం తులసి ఆకుల రసం పురుషుల్లో వీర్యవృద్ధికి?