కొబ్బరి నూనె, వంటసోడాతో జుట్టు పెరుగుతుందా?

అరటి పండు గుజ్జులో గుడ్డు తెల్లసొనను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన వెంట్రుకలు రాలవడం వంటి సమస్యలు తొలగిపోతాయి. తేనెను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరు

శుక్రవారం, 31 ఆగస్టు 2018 (16:25 IST)
అరటి పండు గుజ్జులో గుడ్డు తెల్లసొనను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన వెంట్రుకలు రాలవడం వంటి సమస్యలు తొలగిపోతాయి. తేనెను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది.
 
ఒక కప్పు నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.
 
15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మంపై గల నల్లటి వలయాలు, మచ్చలు, మెుటిమలు తొలగిపోతాయి. తద్వారా ముఖం కాంతివంతగా మారుతుంది.

కొబ్బరి నూనెలో కొద్దిగా వంటసోడాను కలుపుకును వెంట్రుకలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలిపోకుండా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం స్ట్రాబెర్రీ పండ్ల అద్భుత ప్రయోజనాలు...