పైనాపిల్ రసంలో వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

బంగాళాదుంప, క్యారెట్‌ను ఉడికించుకుని గుజ్జులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా బేకిండ్ సోడా, పసుపు వేసుకుని బాగా పేస్ట్‌లా చేసుకుని ముఖానికి, చేతులకు రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై ముడతలు

బుధవారం, 29 ఆగస్టు 2018 (11:40 IST)
బంగాళాదుంప, క్యారెట్‌ను ఉడికించుకుని గుజ్జులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా బేకిండ్ సోడా, పసుపు వేసుకుని బాగా పేస్ట్‌లా చేసుకుని ముఖానికి, చేతులకు రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై ముడతలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
 
టమోటా గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మృతకణాలు తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగులో కొద్దిగా తేనె, ఆలివ్ నూనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పొడిబారిన చర్మం మృదువుగా మారుతుంది. 
 
పైనాపిల్ పండు రసంలో కొద్దిగా వంటసోడా, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం నునుపుగా మారుతుంది. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి పట్టించాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖ చర్మకణాల్లో ఉండే నూనె తొలగిపోతుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రతిరోజూ బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకుంటే?