Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎగ్ టమోటా నూడిల్స్ ఎలా చేయాలో తెలుసా?

కావలసిన పదార్థాలు: గుడ్లు - 4 ఉల్లిపాయలు - 10 నూనె - 100 గ్రాములు ఉప్పు - సరిపడా ఎగ్ నూడిల్స్ - 1 కేజీ జీలకర్ర పొడి - 2 స్పూన్స్ నీరు - 2 లీటర్స్ కారం - 2 స్పూన్స్ టమోటాలు - 6 టమోటా సాస్ - 4 స్పూన్స్

Advertiesment
ఎగ్ టమోటా నూడిల్స్ ఎలా చేయాలో తెలుసా?
, గురువారం, 23 ఆగస్టు 2018 (13:40 IST)
కావలసిన పదార్థాలు:
గుడ్లు - 4
ఉల్లిపాయలు - 10
నూనె - 100 గ్రాములు
ఉప్పు - సరిపడా
ఎగ్ నూడిల్స్ - 1 కేజీ
జీలకర్ర పొడి - 2 స్పూన్స్
నీరు - 2 లీటర్స్
కారం - 2 స్పూన్స్
టమోటాలు - 6
టమోటా సాస్ - 4 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా 2 నీటర్ల నీటిలో 4 స్పూన్స్ టమోటా సాస్‌ను వేసుకుని అందుకు సరిపడా ఉప్పు, నూడిల్స్ వేసుకుని సగానికి వచ్చేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. బాగా ఉడికిన తరువాత బాణలిలో నూనెను పోసి వేడయ్యాక టామోటాలను వేసి 2 స్పూన్స్ కారం వేసుకుని కాసేపు వేయించాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన నూడిల్స్‌ను, ముక్కలుగా కట్ చేసుకున్న గుడ్లను ఆ మిశ్రమంలో వేసి 10 నిమిషాల పాటు మూతపెట్టుకుని దించేయాలి. అంతే ఎగ్ టమోటా నూడిల్స్ రెడీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తామర రేకులతో టీ తాగితే..?