Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నూడుల్స్‌ సమోసా ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: మైదాపిండి - పావుకిలో వాము - 1/5 స్పూన్ ఉప్పు - తగినంత నూనె - సరిపడా నీళ్లు - తగినన్ని అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ బీన్స్‌ ముక్కలు - 2 స్పూన్స్ క్యారెట్ ముక్కలు - 2 స్పూన్స్ క్

Advertiesment
నూడుల్స్‌ సమోసా ఎలా చేయాలో చూద్దాం...
, సోమవారం, 13 ఆగస్టు 2018 (13:02 IST)
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - పావుకిలో
వాము - 1/5 స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
నీళ్లు - తగినన్ని
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
బీన్స్‌ ముక్కలు - 2 స్పూన్స్
క్యారెట్ ముక్కలు - 2 స్పూన్స్
క్యాబేజీ తురుము - పావుకప్పు
క్యాప్సికమ్ ముక్కలు - 1 స్పూన్
రెడ్‌చిల్లీ సాస్ - 1 స్పూన్
సోయాసాస్ - 2 స్పూన్స్
ఉల్లికాడల తురుము - 2 స్పూన్స్
మెుక్కజొన్న పిండి - 1 స్పూన్
నూడుల్స్ - 2 కప్పులు(ఉడికించినవి)
 
తయారీ విధానం: 
ముందుగా బాణలిలో స్పూన్ నూనెను వేసి కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుని తరువాత చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, రెడ్‌చిల్లీసాస్, సోయాసాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఉల్లికాడల తురుము కూడా వేసుకుని వేగనివ్వాలి. చివరగా మెున్నజొన్న పిండిని చల్లుకుని ఉండికించిన నూడుల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్లేట్‌లో వేసుకుని ఆరనివ్వాలి. 
 
ఒక గిన్నెలో మైదాపిండి, వాము, ఉప్పు, కొద్దిగా నూనెను వేసుకుని కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ ముద్దలా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని చిన్న ముద్దల్లా చేసుకుని పూరీల్లా వత్తాలి. దీన్ని సగానికి కోసి ఒక్కో త్రికోణాకారంలో చుట్టి అందులో నూడుల్స్ మిశ్రమాన్ని పెట్టుకుని అతికించాలి. ఆ తరువాత నూనెను వేయించి తీసుకుంటే వేడివేడి నూడుల్స్ సమోసా రెడీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే నువ్వులు..