Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరటికాయ, క్యారెట్ గారెలు ఎలా చేయాలో చూద్దాం....

కావలసిన పదార్థాలు: అరటికాయ - 1 బియ్యప్పిండి - 1 కప్పు క్యారెట్ తురుము - 1 కప్పు ఉల్లిపాయ - 1 వెల్లుల్లి రెబ్బలు - 10 పచ్చిమిర్చి - 5 కొత్తిమీర తురుము - అరకప్పు ఉప్పు - తగినంత జీలకర్ర - 1 స్పూన్ నూనె-

అరటికాయ, క్యారెట్ గారెలు ఎలా చేయాలో చూద్దాం....
, సోమవారం, 6 ఆగస్టు 2018 (13:09 IST)
కావలసిన పదార్థాలు:
అరటికాయ - 1
బియ్యప్పిండి - 1 కప్పు
క్యారెట్ తురుము - 1 కప్పు
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి రెబ్బలు - 10 
పచ్చిమిర్చి - 5
కొత్తిమీర తురుము - అరకప్పు
ఉప్పు - తగినంత
జీలకర్ర - 1 స్పూన్
నూనె- సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును వేసుకుని మిక్సీలో వేసి పేస్టు సిద్ధం చేసుకోవాలి. తరువాత ఓ గిన్నెలో ఉడికించిన అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో క్యారెట్‌ తురుము, తగినంత బియ్యప్పిండి వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్టుతో పాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గారెల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీస్తే రుచికరమైన అరటికాయ క్యారెట్‌ గారెలు సిద్ధం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజంగా బరువు తగ్గాలనుకుంటే ఇలా చేయొద్దు...