Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్ట్రాబెర్రీ పండ్ల అద్భుత ప్రయోజనాలు...

కంటి ఆరోగ్యానికి క్యారెట్స్, స్ట్రాబెర్రీలు చాలా ఉపయోగపడుతాయి. ముఖ్యంగా స్ట్రాబెర్రీలను తరుచుగా ఆహారంగా తీసుకోవడం వలన కంటి ఆరోగ్యానికి మంచిగా దోహదపడుతుంది. కొంతమంది చిన్న వయస్సులోనే కంటి చూపును కోల్పో

Advertiesment
స్ట్రాబెర్రీ పండ్ల అద్భుత ప్రయోజనాలు...
, శుక్రవారం, 31 ఆగస్టు 2018 (15:28 IST)
కంటి ఆరోగ్యానికి క్యారెట్స్, స్ట్రాబెర్రీలు చాలా ఉపయోగపడుతాయి. ముఖ్యంగా స్ట్రాబెర్రీలను తరుచుగా ఆహారంగా తీసుకోవడం వలన కంటి ఆరోగ్యానికి మంచిగా దోహదపడుతుంది. కొంతమంది చిన్న వయస్సులోనే కంటి చూపును కోల్పోతుంటారు. అటువంటివారికి స్ట్రాబెర్రీ పండ్లు చక్కటి ఔషధంగా సహాయపడుతాయి.
 
స్ట్రాబెర్రీలలో గల విటమిన్ సి కంటి చూపును మెరుగుపరచుటకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ పండ్లలో గల యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. గర్భిణులకు కావలసిన ముఖ్యమైన పోషకం ఫోలిక్ యాసిడ్. ఈ పదార్థం గర్భంలోని శిశువు వెన్నెముక సంబంధిత లోపమైన వంటి సమస్యలను నివారించుటకు మంచిగా దోహదపడుతుంది.
 
ఈ ఫోలిక్ యాసిడ్ ఎర్రరక్తకణాలు వృద్ధిచెందడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి సమర్థంగా పనిచేస్తుంది. చర్మం మీద దద్దుర్లు, తలనొప్పి, నిద్రలేమి, అలర్జీ వంటి సమస్యలు గల వారు మాత్రం ఎట్టిపరిస్థితులలోనూ స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీలో స్పందనల్లేవ్.. అందుకే అక్కడికి వెళ్తున్నా ... ఏం చేయను?