Webdunia - Bharat's app for daily news and videos

Install App

బత్తాయిరసంలో చిటికెడు బ్లాక్ సాల్ట్ కలిపి చిగుళ్లపై రాస్తే?

డయేరియా వల్ల కలిగే అలసటకీ నీరసానికీ బత్తాయిరసం ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బత్తాయి రసం రక్తవృద్ధికీ, వీర్యవృద్ధికీ కూడా తోడ్పడుతుంది. నరాలమీద ఒత్తిడినీ తగ్గిస్తుంది. బత్తాయి రసంలో

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2017 (13:25 IST)
డయేరియా వల్ల కలిగే అలసటకీ నీరసానికీ బత్తాయిరసం ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బత్తాయి రసం రక్తవృద్ధికీ, వీర్యవృద్ధికీ కూడా తోడ్పడుతుంది. నరాలమీద ఒత్తిడినీ తగ్గిస్తుంది. బత్తాయి రసంలో జీలకర్ర, అల్లంపొడి వేసుకుని తాగితే ఆస్తమా కారణంగా దగ్గుతో బాధపడేవాళ్లకి ఉపశమనంగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు జుట్టుపెరుగుదలకీ చర్మ సౌందర్యానికీ దోహదపడతాయి.
 
బత్తాయిలో పుష్కలంగా ఉండే విటమిన్-సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. చిగుళ్లనుంచి రక్తం కారుతుంటే బత్తాయిరసంలో చిటికెడు బ్లాక్ సాల్ట్ కలిపి రాస్తే వెంటనే ఫలితం ఉంటుంది. రోజూ బత్తాయి రసం తీసుకుంటే, చర్మం మీదున్న మచ్చలు తొలగిపోయి నిగారింపు వస్తుంది.
 
బత్తాయిలోని లిమోనాయిడ్స్‌ ఊపిరితిత్తులను శుభ్రపరుస్తాయి. గొంతు ఇన్‌ఫెక్షన్లకు గొప్ప ఔషధంగా ఈ పండు రసం పనిచేస్తుంది. జాండిస్ నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న వారి శక్తిహీనతను, నీరసాన్నీ పోగొట్టి త్వరితంగా ఆరోగ్యవంతులు కావడానికి బత్తాయి రసం సహకరిస్తుంది. బత్తాయి రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెకు బలాన్నిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments