అరటిపండును టిఫిన్‌తో కలిపి తీసుకుంటే మేలేంటి?
అరటిపండును టిఫిన్‌తో కలిపి తీసుకుంటే మేలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే అరటి పండ్లను ఉదయం పూట అల్పాహారంతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. శరీరానికి కావలసిన పొటాషియంన
Publish Date: Sat, 21 Oct 2017 (09:35 IST)
Updated Date: Sat, 21 Oct 2017 (09:51 IST)
అరటిపండును టిఫిన్‌తో కలిపి తీసుకుంటే మేలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే అరటి పండ్లను ఉదయం పూట అల్పాహారంతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. శరీరానికి కావలసిన పొటాషియంను ఇది అందిస్తుంది. అరటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి పండును ప్రతిరోజు డైట్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.
అరటి పండ్లను ఎప్పటికప్పుడు తాజాగా కట్ చేసుకుని తినాలి. అరటి పండులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. హృద్రోగ సమస్యలు, యాసిడిటి సమస్యలను అరటి తొందరగా అరికడుతుంది.
అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండటంవలన బ్లెడ్ ప్రెషర్‌ని తగ్గిస్తుంది. ప్రతి రోజు అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ ని ఎక్కువ చేసి అనీమియాను రాకుండా చేస్తుంది. మచ్చలున్న అరటి పండులో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.