Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్లను ఇలా తాగితే ఎన్ని రోగాలు పోతాయో తెలుసా? (video)

Webdunia
బుధవారం, 28 జులై 2021 (18:50 IST)
రాగి పాత్రలో రాత్రిపూట నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం వలన శరీరంలోని కఫ, వాత, పిత్త దోషాలను బ్యాలెన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీరంలోని వివిధ అవయవాల పనితీరు మెరుగుపడేందుకు కూడా ఇది సహకరిస్తుంది. 
 
రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. అల్సర్లు తగ్గడానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవడానికి ఇది సహకరిస్తుంది. కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. ఆహారంగా తీసుకున్న పోషకాలు శరీరానికి అందుతాయి. 
 
వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ప్రయోజనకరం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి, జీర్ణక్రియ పనితీరు మెరగుపడటానికి రాగి పాత్రలోని నిల్వ ఉంచిన నీటిని తాగడం ఉపకరిస్తుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల తనకు అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని శరీరం బయటకు పంపుతుంది.
 
గాయాలు త్వరగా మానడానికి కూడా ఇది ఉపకరిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త కణాల ఉత్పత్తికి రాగి దోహదం చేస్తుంది. శరీరంలో లోపల, ముఖ్యంగా కడుపులో ఏర్పడిన పుండ్లను మాన్పడానికి రాగి సహకరిస్తుంది.  వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి రాగి్ పాత్రలో నిల్వ ఉంచిన నీరు సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలను దరిచేరకుండా చేస్తుంది.
 
క్యాన్సర్ వచ్చే ముప్పును కూడా ఇది తగ్గిస్తుంది. ఇందులోని యాంటి ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలతో పోరాడుతాయి. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండటంతోపాటు, థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగపడుతుంది. 
 
ఆర్థరైటిస్ రాకుండా, కీళ్ల నొప్పుల బారిన పడకుండానూ ఇది కాపాడుతుంది. చర్మ వ్యాధుల బారిన పడకుండా, రక్తహీనత తగ్గడానికి ఈ అలవాటు ఉపకరిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

తర్వాతి కథనం
Show comments