Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీర తీసుకుంటే అవన్నీ తగ్గిపోతాయ్...

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (20:58 IST)
సాధారణంగా మనం వంటకాలలో రుచి కోసం, వాసన కోసం, గార్నిష్ కోసం కొత్తిమీరను వాడుతూ ఉంటాం. ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. దీని ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం.
 
1. కొత్తిమీర యాంటీ-ఆక్సిడేంట్స్‌ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది.
 
2. చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గించటంలో కొత్తిమీర ప్రధానపాత్ర వహిస్తుంది. 
 
3. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K' కొత్తిమీరలో పుష్కలంగా ఉంటుంది. జింక్, కాపర్, పొటాషియం వంటి మినరల్స్ కూడా కొత్తిమీరలో అధికంగా ఉంటాయి.
 
4. కొత్తిమీర ఆహారాన్ని రుచిగానే కాకుండా, జీర్ణక్రియ స్థాయిని కూడా పెంచును. అంతేకాకుండా అజీర్ణం, వాంతులు వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.
 
5. కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్‌లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఆపుతుంది.
 
6. కొత్తీమీరను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవటం వలన కిడ్నీలలో వచ్చే రాళ్లను నివారించుకోవచ్చు. అదేవిధంగా పిల్లలు మరియు పెద్దల్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ను నివారించుకోవచ్చు.
 
7. కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది. అంతేకాదు ఇది బ్లడ్ బిల్డర్ కూడా. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments