Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో కాలి గోళ్ళను శుభ్రం చేస్తున్నారా..?

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (11:59 IST)
వర్షాకాలంలో కాలి గోళ్ళను శుభ్రం చేస్తున్నారా..? కాలిగోళ్ళను శుభ్రంగా ఉంచుకోవడంతో ఇన్ఫెక్షన్లు, జ్వరం, జలుబు నుంచి దూరంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించండి. 
 
ముందుగా కాలిగోళ్ళను పొట్టిగా ఉంచాలి. గోళ్ళను పొట్టిగా ఉంచడం ద్వారా శుభ్రంగా ఉంచడమే కాకుండా.. చాలా చక్కగా నీట్‌గా కనబడతాయి. 
 
కాలి గోళ్ళను శుభ్రం చేసేందుకు గోళ్ళ బ్రష్‌ను వాడండి. ఇది సున్నితంగా మృత చర్మ కణాలను, మొత్తం మురికిని గోళ్ళ నుండి తొలగిస్తుంది. 
 
గోళ్ళను కత్తిరించినప్పుడు అవి సమంగా శుభ్రంగా కనపడేటట్టు చూడండి, ఎందుకంటే సమంగా లేని గోళ్ళు అసహ్యంగా వికారంగా కనబడతాయి.
 
వర్షాల్లో తడిచినట్లైతే స్నానం చేస్తున్నప్పుడు కాళ్ళను కడగడం మర్చిపోకండి. కాళ్ళను శుభ్రం చేసేటప్పుడు సబ్బును ఉపయోగించండి.  కానీ పాదాలకు మాత్రం సున్నితమైన సబ్బును వాడండి. గోరు చుట్టూ ఉన్న ప్రదేశాన్నే కాక కాలి వేళ్ళను, పాదాలను కూడా శుభ్రం చేయడానికి ప్రయత్నించండి.
 
చివరగా, కాలి గోళ్ళు శుభ్రంగా, తాజాగా కనపడడానికి, గోరు రంగుతో ఉన్న నైల్ పాలిష్‌ను వాడితే, అవి కొత్తగా కనపడతాయి. ప్రతి వారం దాన్ని తొలగించి తిరిగి వాడితే ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments