Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ బ్రౌన్ రైస్ తీసుకుంటే?

ప్రస్తుత తరుణంలో పాలిష్ చేసిన బియ్యాన్నే ఎక్కువగా తీసుకుంటున్నాము. కానీ అది మంచిది కాదు. పూర్వికులు దంపుడు బియ్యాన్నే తినేవారు. ఈ బియ్యాన్ని తీసుకోవడం వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. పాలిష్

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (10:19 IST)
ప్రస్తుత తరుణంలో పాలిష్ చేసిన బియ్యాన్నే ఎక్కువగా తీసుకుంటున్నాము. కానీ అది మంచిది కాదు. పూర్వికులు దంపుడు బియ్యాన్నే తినేవారు. ఈ బియ్యాన్ని తీసుకోవడం వలన వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. పాలిష్ చేసిన బియ్యాన్ని తీసుకోవడం వలన అనారోగ్యాలకు గురియగుతున్నారు. అందువలన వాటికి బదులుగా బ్రౌన్ రైస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
ముడి బియ్యం తీసుకోవడం వలన అనేక పోషకాలు అందడంతోపాటు పలు అనారోగ్య సమస్యలు నుండి విముక్తి చెందవచ్చును. మరి ఈ బియ్యంలో గల లాభాలను తెలుసుకుందాం. డయోబెటిస్ ఉన్నవారికి ఈ బియ్యం చాలా సహాయపడుతాయి. ఈ ముడిబియ్యంలో ఉండే ఫైటిక్ యాసిడ్, ఫైబర్, పాలిఫినాల్స్, సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్స్ రక్తంలోకి గ్లూకోజ్ విడుదలయ్యే ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. తద్వారా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.  
 
ఎముకలను దృఢంగా ఉంచేందుకు బ్రౌన్ రైస్ ఎంతగానో దోహదపడుతాయి. ఈ బ్రౌన్ రైస్‌లో మెగ్నిషియం, క్యాల్షియం అధికంగా ఉంటాయి. దీనిలో సెలీనియం గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. హైబీపీ అదుపులో ఉంటుంది. రక్తసరఫరా మెరుగుపడుతుంది. ప్రతిరోజూ బ్రౌన్ రైస్ తీసుకోవడం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఈ బియ్యంలో ఉండే పాస్పరస్ శరీరంలో ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది. 
 
ఆకలిని నియంత్రించుటలో ఈ బియ్యం ఎంతోగానో సహాయపడుతాయి. ఇందులో ఉండే మెగ్నిషియం శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. దీంతో అలసట, నీరసం వంటి చికాకులు తొలగిపోతాయి. చురుగ్గా కూడా ఉంటారు. ఈ బ్రౌన్ రైస్ తీసుకునే వారికి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం 13 శాతం వరకు తగ్గుతుందని అధ్యయంలో చెప్పబడుతోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments