Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విటమిక్ 'కె' ఎందుకు అవసరమో తెలుసా?

శరీరానికి విటమిన్ కె చాలా అవసరం. సాధారణంగా చాలామందికి విటమిన్ ఎ, బి, సి ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం తెలుసు. కానీ విటమిన్ కె ఉన్న ఆహారపదార్థాలు గురించి అంతంగా తెలియదు. ఈ విటమిక్ ఆహారపదార్థాలను తీసుకోవ

Advertiesment
విటమిక్ 'కె' ఎందుకు అవసరమో తెలుసా?
, గురువారం, 26 జులై 2018 (14:54 IST)
శరీరానికి విటమిన్ కె చాలా అవసరం. సాధారణంగా చాలామందికి విటమిన్ ఎ, బి, సి ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం తెలుసు. కానీ విటమిన్ కె ఉన్న ఆహారపదార్థాలు గురించి అంతంగా తెలియదు. ఈ విటమిన్ కె ఆహారపదార్థాలను  తీసుకోవడం వలన ఎముకల దగ్గర నుండి గుండె వరకు ప్రతి అవయవానికి ఎంతో ఆరోగ్యానికి ఇస్తుంది. మరి ఈ విటమిన్ కెలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.
 
శరీరంలో ఎప్పుడైన గాయాలైనప్పుడు రక్తం ఎక్కువగా వస్తుంటుంది. అలా వెలువడే రక్తం కూడా వెంటనే గడ్డకడుతుంది. ఈ విటమిన్ కె రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. శరీరంలో రక్తం తగినంత లేకపోతే రక్తస్రావం ఆగడం చాలా కష్టమే. కాబట్టి విటమిన్ కె ఉన్న ఆహారాపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
 
ఆస్టియోపోరోసిస్ అనే కీళ్ల వ్యాధి రాకుండా ఉండేందుకు విటమిన్ కె చాలా దోహదపడుతుంది. ముఖ్యంగా మహిళలు విటమిన్ కె ఎక్కువగా అందేలా చూసుకోవాలి. గుండె ధమనుల మీద క్యాల్షియం పేరుకుపోకుండా రక్తసరఫరా ఎలాంటి అడ్డంకాలు లేకుండా గుండెకు చేరెందుకు విటమిన్ కె చాలా సహాయపడుతుంది.
 
సాధారణంగా పుట్టిన పిల్లల్లో విటమిన్ కె తక్కువగానే ఉంటుంది. అందుకు వైద్యులు వారికి విటమి 'కె'ను ఇంజెక్షన్స్ రూపంలో వేస్తుంటారు. పురుషులకు రోజుకు 120 మిల్లీగ్రాములు, స్త్రీలకు రోజుకు 90 మిల్లీగ్రాముల విటమిన్ కె అవసరముంటుంది. అందువలన ఆకుకూరలు, మాంసాహారం, సోయాబీన్స్, పాలు అధికంగా తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ కె వీటిల్లోనే ఎక్కువగా లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెులకెత్తిన పెసలతో కూర ఎలా చేయాలో చూద్దాం...