విషమంగా డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం...
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం జ్వరంతో పాటు మూత్రనాళాల ఇన్ఫెక్షన్ కారణంగా చెన్నైల
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం జ్వరంతో పాటు మూత్రనాళాల ఇన్ఫెక్షన్ కారణంగా చెన్నైలోని గోపాలపురం నివాసంలో ఆయనకు కావేరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన ప్రత్యేక వైద్య బృదం చికిత్సలు చేస్తోంది. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం ఏమాత్రం కుదుటపడలేదు.
కాగా, తన తండ్రి ఆరోగ్యం దృష్ట్యా ఆయను చూసేందుకు అభిమానులు ఎవరూ రావొద్దని ఆయన కుమారుడు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కోరారు. అయితే, కరుణ కుటుంబం మాత్రం కొంత ఆందోళనగానే ఉంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఉపముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం గురువారం కరుణ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
మరోవైపు, తమిళనాడు సీఎంగా ఆయన మొదటిసారి 1969లో బాధ్యతలు చేపట్టారు. కాగా డీఎంకే అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టి గురువారంతో 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. కరుణానిధిని చూసేందుకు సందర్శకులను అనుమతించడంలేదు.