Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహంతో బాధపడేవారు అరటిపండ్లు తీసుకోవచ్చా?

Webdunia
సోమవారం, 13 మే 2019 (15:44 IST)
మధుమేహంతో బాధపడేవారు అరటిపండ్లను తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మ‌ధుమేహం ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తింటే వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త్వ‌ర‌గా పెరుగుతాయి.


మ‌ళ్లీ ఆ స్థాయిలు త‌గ్గాలంటే అందుకు లివ‌ర్‌, మూత్ర‌పిండాల‌పై అధిక భారం ప‌డుతుంది. క‌నుక మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు అర‌టిపండ్ల‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. లేదంటే చ‌క్కెర స్థాయిలు పెరిగి త‌రువాత ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుందని వారు సూచిస్తున్నారు. 
 
అలాగే అధిక బ‌రువు ఉన్న వారు, స్థూల‌కాయులు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దు. తింటే అందులో ఉండే కార్బొహైడ్రేట్లు వారిలో అధికంగా కొవ్వును ఉత్ప‌త్తి చేస్తాయి. దీంతో ఇంకా ఎక్కువ బ‌రువు పెరుగుతారు. క‌నుక అధిక బ‌రువు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌రాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
అలాగే అర‌టి పండ్ల‌లో థ‌యామిన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది మైగ్రేన్ ఉన్న‌వారికి మంచిది కాదు. దీని వ‌ల్ల త‌ల‌నొప్పి ఇంకా ఎక్కువ‌వుతుంది. అది నాడుల డ్యామేజ్‌కు దారి తీస్తుంది.

ముఖ్యంగా అల‌ర్జీ స‌మ‌స్య ఉన్న‌వారు అర‌టిపండ్ల‌ను తిన‌రాదు. తింటే ముఖం, ఇత‌ర శ‌రీర భాగాలు ఉబ్బిన‌ట్టు క‌నిపిస్తాయి. దుర‌ద కూడా ఉంటుంది. క‌నుక అలాంటి వారు అర‌టిపండ్ల‌ను మానేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments