Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు పండు పురుషులు తింటే...?

నేరేడు పండు అంటే తెలియని వారుండరు. ఈ పండును పిల్లలు, పెద్దలు అందరు అమితంగా ఇష్టపడతారు. నేరేడుపండును నేసవి కాలపు పండుగా చెబుతారు. ఇందులో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహంతో పాటు అనేక శారీరక సమస్యలను నేరేడు పండు దూరం చేస్తుంది. నేరే

Webdunia
మంగళవారం, 29 మే 2018 (22:06 IST)
నేరేడు పండు అంటే తెలియని వారుండరు. ఈ పండును పిల్లలు, పెద్దలు అందరు అమితంగా ఇష్టపడతారు. నేరేడుపండును నేసవి కాలపు పండుగా చెబుతారు. ఇందులో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహంతో పాటు అనేక శారీరక సమస్యలను నేరేడు పండు దూరం చేస్తుంది. నేరేడు పండు, నేరేడు ఆకులు, నేరేడు చెట్టు బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
 
1. నేరేడుపండు సోడియం, పొటాషియం, క్యాల్షియం, పాస్పరస్, మాంగనీస్, జింక్, విటమిన్ ఎ, సితో పాటు రైబోప్లెనిన్, పోలిక్ యాసిడ్లను సమృద్దిగా కలిగి ఉంది.
 
2. నేరేడు పండు షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట గొప్పవరం అని చెప్పవచ్చు. మధుమేహంతో బాధపడేవారు నేరేడు గింజల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని చక్కెర శాతాన్న తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇది అధిక రక్తపోటు సమస్యను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
3. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నేరేడు పండు రక్తాన్ని శుద్ది చేయడమే కాకుండా రక్తంలో కేన్సర్ కారకాలు వృద్ది చెందకుండా నిరోదిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ మరియు విటమిన్ సి రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.
 
4. నేరేడు పండ్లను తినడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. నేరేడు గింజల పొడి ముఖానికి ప్యాక్‌గా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ నేరేడు పండు పురుషుల్లో శృంగార శక్తిని పెంచుతుంది. 
 
5. నేరేడు పండు మన జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలకు ఇది ఒక చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. కడుపు ఉబ్బరం మరియు వాంతి అయ్యేలా ఉండే లక్షణాలను తగ్గిస్తుంది. మలబద్దకంతో పాటు మూత్ర సంబందిత సమస్యలను నివారిస్తుంది.
 
6. ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేస్తుంది. అనేక చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా కీళ్లనొప్పులను మరియు లివర్ సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments