Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎర్రని పండుమిర్చి చూడగానే నోరూరుతోందా? ఐతే అది....

మార్కెట్లో ఎర్రని పండుమిర్చి కనిపించగానే రోటి పచ్చడి రుచి నోరూరిస్తుంటుంది. అయితే చాలామందికి పచ్చిమిర్చి మంచిదా, పండుమిర్చి మంచిదా అనే సందేహం వెంటాడుతుంటుంది. కానీ రెండూ మంచివే. ఏ కాలంలో దొరికేవి ఆ కాలంలో తింటే మంచిది. అయితే పండు మిర్చిలోని ఆరోగ్య ప్

Advertiesment
Red Chili
, సోమవారం, 19 మార్చి 2018 (17:14 IST)
మార్కెట్లో ఎర్రని పండుమిర్చి కనిపించగానే రోటి పచ్చడి రుచి నోరూరిస్తుంటుంది. అయితే చాలామందికి పచ్చిమిర్చి మంచిదా, పండుమిర్చి మంచిదా అనే సందేహం వెంటాడుతుంటుంది. కానీ రెండూ మంచివే. ఏ కాలంలో దొరికేవి ఆ కాలంలో తింటే మంచిది. అయితే పండు మిర్చిలోని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
 
1. ఆకుపచ్చని పచ్చిమిర్చి, పసుపురంగు పచ్చిమిర్చిలతో పోలిస్తే పండుమిర్చిలో విటమిన్ సి, బీటాకెరోటిన్‌ల శాతం ఎక్కువ. ఎ, బి, సి విటమిన్లతో పాటు ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్‌తోనూ పోరాడగలదు. ముఖ్యంగా ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు ఇది సహాయపడుతుందట. పొట్టలో హానికర బ్యాక్టీరియాని నివారిస్తుంది.
 
2. పండు మిర్చి రంగు చూస్తేనే నోరూరుతుంది. అంటే ఆకలిని పెంచినట్లేగా. అలాగే ఇది రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేయడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వుని సైతం కరిగించే గుణాలు ఇందులో ఉంటాయి.
 
3. జలుబూ, జ్వరాలు రాకుండా నిరోధించే గుణాలూ ఇందులో ఎక్కువే. నొప్పులకి కారణమయ్యే ఇన్‌ప్లమేషన్లని తగ్గిస్తుందట. దాని ఫలితంగానే ఆర్ధ్రయిటీస్, సోరియాసిస్, డయోబెటిక్, న్యూరోపతి.. వంటి వాటి కారణంగా తలెత్తే నొప్పుల్ని తగ్గించే గుణం పండుమిర్చిలో ఎక్కువ. దీన్ని తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే, జీర్ణశక్తినీ, జీవక్రియనీ పెంచడంతో పాటు బరువు పెరగకుండానూ చేస్తుంది. ఇది తిన్నాక పుట్టే వేడి కారణంగా వ్యాయామంలో మాదిరిగా క్యాలరీలు కరుగుతాయి. 
 
4. ఆస్తమా, సైనస్, జలుబులతో బాధపడేవాళ్లు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఊపిరితిత్తులు, గొంతు, ముక్కుల్లో శ్లేష్మం, మ్యూకస్ పేరుకోకుండా ఉంటుంది. పండుమిర్చి వాసన తలనొప్పుల్ని తగ్గిస్తుందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొప్పాయిని ఎందుకు తినాలి?