Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటు(బిపి)ని ఉసిరికాయ అడ్డుకుంటుంది... ఏం చేయాలంటే?

మార్కెట్లో చౌకగా లభించే వాటిల్లో ఉసిరికాయ ఒకటి. ఈ ఉసిరికాయ వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఉసిరికాయలు దొరికే సమయంలో వాటిని సేకరించి ఎండబెట్టి ఉంచుకుంటే, దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో విధములైన ఆరోగ్య సమస్యల గురించి బయటపడవచ్చు. అవేం

Webdunia
మంగళవారం, 8 మే 2018 (22:12 IST)
మార్కెట్లో చౌకగా లభించే వాటిల్లో ఉసిరికాయ ఒకటి. ఈ ఉసిరికాయ వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఉసిరికాయలు దొరికే సమయంలో వాటిని సేకరించి ఎండబెట్టి ఉంచుకుంటే, దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో విధములైన ఆరోగ్య సమస్యల గురించి బయటపడవచ్చు. అవేంటంటే....
 
1. ఉసిరిక, వేయించిన జీలకర్ర, ఎండుగులాబి పూలు, నల్లఉప్పు చూర్ణాల్ని సమంగా కలిపి ఒక స్పూన్ వంతున రోజూ రెండు సార్లు సేవిస్తుంటే కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం, దుర్వాసన గల తేన్పులు, కడుపులో తిప్పినట్లుండడం, వాంతులు లాంటి సమస్యలు తగ్గుతాయి.
 
2. సమపాళ్లలో కలిపిన ఉసిరిక, పసుపుల చూర్ణాన్ని ఒక స్పూన్ వంతున రోజూ రెండుమూడు సార్లు పంచదార లేదా తేనె కలిపి సేవిస్తుంటే స్త్రీలల్లో కలిగే తెల్లబట్ట వ్యాధి తగ్గుతుంది. మూత్ర విసర్జన సమయంలో కలిగే చురుకు, మంట తగ్గుతాయి. అంతేకాకుండా రక్తం శుభ్రపడి చర్మవ్యాధులు తగ్గుతాయి.
 
3. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఉసిరిక చూర్ణాల్ని వేసి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి పటికబెల్లం పొడి కలిపి తాగుతుంటే రక్తపు పోటు క్రమబద్దమవుతుంది. తలదిమ్ము, తలతిరగడం వంటి పైత్య వికారాలు తగ్గుతాయి. రెండింతల బెల్లం కలిపిన ఉసిరిక చూర్ణాన్ని గచ్చకాయ మోతాదులో సేవిస్తుంటే కీళ్లనొప్పులు, మలబద్దకం, మూలవ్యాధి, శిరోజాలు తెల్లబడడం, ఊడిపోవడం తగ్గుతాయి.
 
4. ఉసిరిక, శొంఠి, తిప్పసత్తు చూర్ణాల్ని సమంగా కలిపి ఒక స్పూను వంతున రోజూ రెండు సార్లు తేనె లేదా పాలల్లో కలిపి తీసుకుంటుంటే వీర్యవృద్ది అవుతుంది. శుక్రదోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా కీళ్లు, కండరాల నొప్పులు తగ్గుతాయి.
 
5. ప్రతిరోజు అరస్పూను ఉసిరికపొడిని గోరువెచ్చని నీటితో తీసుకుంటుంటే శుక్రకణాల సంఖ్య పెరిగి సంతానవకాశాలు మెరుగవుతాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments