Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్లీ నీరు తాగితే ఏం జరుగుతుంది?

Webdunia
బుధవారం, 22 మే 2019 (21:52 IST)
సాధారణంగా వేసవిలో ఎండల కారణంగా మన శరీరం అధిక వేడిని కలిగి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి బార్లీ నీరు ఒక ఔషదంలా పని చేస్తుంది. బార్లీలో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తాగడం వలన శరీరంలో వేడి తగ్గుతుంది. అంతేకాకుండా రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. బార్లీలో ఉన్న ఆరోగ్యప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్ విసర్జన క్రియలో శరీరం నుండి విషపదార్ధాలను బయటకు నెట్టివేయడంలో సహాయపడుతుంది. ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది.
 
2. మసాలా పుడ్ తీసుకోవటం వలన కలిగే కడుపుమంటను ఈ పానీయం తగ్గిస్తుంది. బార్లి యాంటీ-ఇన్ప్లమేటరీ లక్షణం కలిగి ఉంది. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు బార్లీనీటిని తాగటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది.
 
3. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ పానీయాన్ని ప్రతిరోజు తాగటం వలన వారి శరీరంలోని చక్కెరస్ధాయిలు కంట్రోల్‌లో ఉంచడంలో ఇది తోడ్పడుతుంది.
 
4. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ ఈ పానీయాన్ని తాగటం వలన రోజువారి మన శరీరానికి అవసరమయ్యే పీచుపదార్ధం భర్తీ అవుతుంది. అంతేకాకుండా ఈ పానీయంలో ఉండే అధిక ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
 
5. బార్లీ రక్తపోటును తగ్గిస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి ప్రతిరోజు ఈ పానీయాన్ని సేవించటం చాలా ఉపయోగకరం.
 
6. మూత్రపిండాలలో ఉన్న రాళ్లను బయటకు పంపించటంలో ఈ బార్లీ నీళ్లు ఎంతగానో సహాయపడతాయి. కనుక  ప్రతిరోజు ఒక గ్లాసు బార్లీ నీళ్లను తాగటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
7. అధికబరువును తగ్గించుకోవటంలో కూడా ఈ బార్లీ ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ చాలా సమయం వరకు పొట్టనిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

తర్వాతి కథనం
Show comments