Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి గుజ్జు, తేనె, నిమ్మరసంతో చర్మానికి?

Webdunia
బుధవారం, 22 మే 2019 (19:09 IST)
జీవన విధానంలో మార్పులు, మన ఆహార అలవాట్లు, కాలుష్యం, రేడియేషన్, మొబైల్ లేదా గాడ్జెట్స్ స్క్రీన్‌లకు ఎక్కువగా ప్రభావితమవడం వంటి అనేక కారణాల వల్ల మన చర్మం తరచుగా పెళుసుగా మారడం, పాడైపోవడం జరుగుతుంది. ముఖంపై మొటిమలు, మృత కణాలు పేరుకుని పోవడం, డెడ్ స్కిన్, డార్క్ స్పాట్స్, చారలు, వృద్ధాప్య చాయలు, కంటి కింద వలయాలు, చర్మం ముడతలు పడడం వంటి సమస్యలు ఇప్పుడు సాధారణం అయిపోయాయి. 
 
ఈ సమస్యలకు కారకాలు ఎన్ని ఉన్నప్పటికీ, కొన్ని చర్మ సంరక్షణా చర్యలను తీసుకుంటే మన సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. మనకు తక్కువ ఖర్చుతో దొరికే బొప్పాయి పండుతో చర్మాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. బొప్పాయి చర్మ సంరక్షిణి. దీనిలో విటమిన్ ఎ, సి, ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
 
బొప్పాయిలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి, మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది పిగ్మెంటేషన్ మరియు నల్లమచ్చల చికిత్సలో కూడా సహాయపడుతుంది. ఇందుకు మీరు చేయవలసింది ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జును తీసుకుని, దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపండి. 
 
అన్నిటినీ పూర్తిస్థాయిలో మిక్స్ చేసి మీ ముఖంపై అప్లై చేయాలి. ఇది డ్రై అయిన తర్వాత కొన్ని నిమిషాల పాటు ఉండనివ్వాలి. సాధారణ నీటిని ఉపయోగించి దీనిని శుభ్రం చేయవచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments