Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రతిరోజూ నాలుగు బాదంపప్పులను రాత్రి నానబెట్టి....

ప్రతిరోజూ నాలుగు బాదంపప్పులను రాత్రి నానబెట్టి....
, బుధవారం, 15 మే 2019 (20:45 IST)
మనం డ్రైప్రూట్స్‌గా పిలువబడే బాదం పప్పులో అనేక రకములైన పోషక విలువలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వీటిలో ఉండే పైటో కెమికల్స్ క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. అంతేకాకుండా దీనిలోని పీచు పదార్దము మలబద్దకమును నివారిస్తుంది. బాదం పప్పులో గల ఆరోగ్యప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది.
 
2. ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇనుము శరీరావయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది.
 
3. అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్‌, రాగి, మెగ్నీషియం.. వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి.
 
4. వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం, ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని.. బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
 
5. బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్‌షేక్‌, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉంది.  
 
6. పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకొంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్‌ ఇ ఉంటుంది. ఇది చక్కని యాంటీఆక్సిడెంట్‌‌గా పని చేస్తుంది.  
 
7. వీటిలో మోనోశాచ్యురేటెడ్‌, పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడుకొవ్వు నిల్వలను నాశనం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ నాలుగు బాదంపప్పులను రాత్రి నానబెట్టి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకొంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేచీకటి పోవాలంటే ఇలా చేయండి...