Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజ వయసుకన్నా పదేళ్లు తక్కువగా కనిపించాలా... వీటిని తింటే...

పెసల్లో పోషకాలు మెండుగా ఉంటాయని, ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. మొలకల్లో ఎంజైములూ, యాంటీ ఆక్సిడెంట్లూ మరింత ఎక్కువగా లభ్యమవుతాయి. అందుకే ఇటీవల వీటిని చాలమంది మొలకెత్తించి తింటున్నారు. అయితే వీటిని మొలకల రూపంలోనో లేదా ఉడికించి... ఎలా తిన్నా కాలేయం, జు

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:03 IST)
1. పెసల్లో పోషకాలు మెండుగా ఉంటాయని, ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. మొలకల్లో ఎంజైములూ, యాంటీ ఆక్సిడెంట్లూ మరింత ఎక్కువగా లభ్యమవుతాయి. అందుకే ఇటీవల వీటిని చాలమంది మొలకెత్తించి తింటున్నారు. అయితే వీటిని మొలకల రూపంలోనో లేదా ఉడికించి... ఎలా తిన్నా కాలేయం, జుట్టు, గోళ్లు, కళ్ల ఆరోగ్యాన్ని పెంపొదిస్తాయని ఆయుర్వేదం పేర్కొంటుంది.
 
2. క్యాలరీలు తక్కువ పీచు ఎక్కువగా ఉండటంతో కొంచెం తిన్నా పొట్ట నిండినట్లనిపిస్తుంది. ఫలితంగా ఊబకాయం తగ్గుతుంది. 
 
3. పెసల్ని క్రమంతప్పకుండా తినేవాళ్లు తమ నిజ వయసుకన్నా పదేళ్లు తక్కువుగా కనిపిస్తారు. ఎందుకంటే వీటిలో అధిక కాపర్ వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
 
4. అజీర్తి, జీవక్రియా లోపంతో బాధపడేవాళ్లకు పెసలు మందులా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. వీటిల్లోని క్యాల్షియం ఎముక నిర్మాణానికి దోహదపడుతుంది. సోడియం దంతాలు, చిగుళ్ల సమస్యల్నీ నివారిస్తుంది. బీపీ రోగులకు ఇవి మంచిదే. 
 
5. పెసల్లోని ఐరన్ వల్ల అన్ని అవయవాలకీ ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి... తదితర లోపాలతో బాధపడేవాళ్లకి ఇవి ఎంతో మేలు చేస్తాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. వీటిల్లోని విటమిన్లు, హర్మోన్లను ప్రేరేపించడంతో పిల్లల్లో పెరుగుదలకి తోడ్పడతాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments