తమలపాకును నమిలితే ఆ సామర్థ్యం రెట్టింపు అవుతుందట..

తమలపాకుల్లో పలు ఔషధ గుణాలున్నాయి. తమలపాకులను రోజుకొకటి నమిలితే.. గ్యాస్, అసిడిటీ దూరమవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. తద్వారా మధుమేహం అదుపులో వు

బుధవారం, 17 జనవరి 2018 (15:41 IST)
తమలపాకుల్లో పలు ఔషధ గుణాలున్నాయి. తమలపాకులను రోజుకొకటి నమిలితే.. గ్యాస్, అసిడిటీ దూరమవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. తద్వారా మధుమేహం అదుపులో వుంటుంది. తమలపాకులను కొద్దిగా తేనెను కలిపి నమిలితే దగ్గు తగ్గిపోతుంది. చర్మ సంబంధ వ్యాధులు దూరమవుతాయి.
 
అలాగే తమలపాకుల్ని రోజూ నమిలితే లైంగిక పటుత్వం పెరుగుతుంది. శృంగార సామ‌ర్థ్యం రెట్టింపు అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి తమలపాకులు బాగా పనిచేస్తాయి. వీటిని తగిన మోతాదులో తేనెతో కలిపి తింటే ఉపశమనం లభిస్తుంది. 
 
తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది. తమలపాకు రసం తీసుకుంటే గొంతు సమస్యలు తొలగిపోతాయి.  మాటలో స్పష్టత వస్తుంది. కఫం తొలగిపోతుంది. జలుబు చేసి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్న సమయంలో తమలపాకును వేడి చేసి కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతి మీద వేసి కడితే ఉపశమనం లభిస్తుంది. తమలపాకులను ముద్దగా చేసి తలకు పట్టించాలి. ఓ గంట సేపు అనంతరం తలస్నానం చేయడం వల్ల చుండ్రు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పిల్లలు చిన్న పని చేసినా క్లాప్స్‌తో ప్రోత్సహిస్తున్నారా?