Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోళ్లు కొరికే దురలవాటు ఉంటే కేన్సర్ ఖాయం...

చాలా మందికి గోళ్లు కొరికే దురలవాటు ఉంటుంది. ఈ అలవాటు కారణంగా కేన్సర్ వ్యాధి బారినపడే అవకాశం ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. పైగా, గోళ్లు కొరికే అలవాటు ఏమాత్రం మంచిది కాదని వారు అంటున్నారు.

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (10:48 IST)
చాలా మందికి గోళ్లు కొరికే దురలవాటు ఉంటుంది. ఈ అలవాటు కారణంగా కేన్సర్ వ్యాధి బారినపడే అవకాశం ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. పైగా, గోళ్లు కొరికే అలవాటు ఏమాత్రం మంచిది కాదని వారు అంటున్నారు. 
 
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌కు చెందిన కోర్ట్నీ విస్టోర్న్ అనే 20 యేళ్ళ యువతికి చిన్న వయసు నుంచి గోళ్లు కొరికే అలవాటు ఉంది. ఈ అలవాటు చివరికి వేళ్ల చివర్లను కొరికే వరకూ దారితీసింది. వేళ్ల నుంచి రక్తస్రావం అయ్యేది. అయినప్పటికీ ఆ అలవాటును మాత్రం మానలేక పోయింది. 
 
ఈ తల్లిదండ్రులకు చెప్పేందుకు ఆమె భయపడిపోయి వేళ్లను వారికి కనబడకుండా దాచుకునేది. దీనికితోడు మార్కెట్‌లో లభ్యమయ్యే కృత్రిమ గోళ్లను పెట్టుకోవడం ప్రారంభించింది. నాలుగేళ్లుగా ఇలా చేయసాగింది. చివరకు ఆ గోళ్లు నల్లని రంగులోకి మారిపోయాయి. దీంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లగా, ఆమెను పరిశీలించిన వైద్యులు స్కిన్‌ కేన్సర్ బారిన పడిందని వెల్లడించారు. 
 
దీనిపై కోర్ట్నీ‌విస్టోర్న్ స్పందిస్తూ, 'గోళ్లు కొరికే దురలవాటు కారణంగా క్యాన్సర్ బారిన పడ్డాను. ఈ అలవాటు ఇలాంటి పరిస్థితికి దారితీస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు' అని వ్యాఖ్యానించింది. కాగా క్యాన్సర్ బారిన పడిన కోర్ట్నీ విస్టోర్న్‌కు ఇప్పటివరకూ నాలుగు సర్జరీలు జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌కు ఎన్నో స్థానం?

అక్రమ వలసల అడ్డుకట్టకు కొత్త నిబంధన అమలు : అమెరికా

Sunitha, పులివెందులకు వెళ్లేందుకు భద్రత కావాలి: వైఎస్ సునీత

'బి-నేలమాళిగ’ తెరిచే అంశంపై చర్చ.. తుది నిర్ణయం పూజారులదే..

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వసలు తెలుగేనా? నీ యాక్సెంట్ తేడాగా వుంది: మంచు లక్ష్మికి అల్లు అర్హ షాక్ (video)

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

తర్వాతి కథనం
Show comments