Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దెకు ప్రియుడు... రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్ యాప్

Webdunia
ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (14:52 IST)
ప్రస్తుతం ఇంటిపట్టునే ఉండి ప్రతి పనీ చక్కబెట్టుకుంటున్నాం. దీనికి కారణం ప్రతి పనీకి ఓ యాప్ అందుబాటులోకి రావడమే. ఇపుడు డేటింగ్‌కు కూడా ఓ యాప్ వచ్చేసింది. ఈ యాప్ పేరు రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్. బాయ్‌ఫ్రెండ్ లేని అమ్మాయిలు ఈ యాప్ ద్వారా ప్రియుడుని అద్దెకు తెచ్చుకోవచ్చు. అదీకూడా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజుల పాటు. 
 
ఈ తరహా యాప్‌ను కౌశల్ ప్రకాశ్ అనే 29 యేళ్ల టెక్కీ రూపొందించారు. నేటి అమ్మాయిల వ్యవహారశైలికి తగ్గుట్టుగా దీన్ని రూపొందించారు. పైగా, యాప్‌లో చాలా ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలో కూడా ఎంచుకోవచ్చు. సెలబ్రెటీ బాయ్ ఫ్రెండ్, మోడల్ బాయ్ ఫ్రెండ్, నార్మల్ బాయ్ ఫ్రెండ్. ఇలా రకాలు ఉంటాయి. వాటిలో ఎవరినైనా ఎంచుకోవచ్చు. 
 
అయితే, ఎంచుకునే బాయ్ ఫ్రెండ్స్‌కు తగినట్టుగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సెలెబ్రిటీ బాయ్‌ఫ్రెండ్‌కు గంటకు రూ.5 వేలు, సాధారణ ప్రియుడుకు అయితే రూ.500 చొప్పున రేటు చెల్లించాల్సి ఉంటుంది. పైగా, వాళ్లతో ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు తిరగొచ్చు.. ఎంజాయ్ చేయొచ్చు. కేవలం ఇది అమ్మాయిలకు మాత్రమే బెనిఫిట్ అనుకుంటే పొరపాటే.
 
దీనిని అబ్బాయిలు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అద్దెకు బాయ్ ఫ్రెండ్స్‌గా వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నవారు కూడా ఈ యాప్ నిర్వాహకులను సంప్రదించవచ్చు. దీనిని ఓ ఉద్యోగంలా పాటించే వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది. పార్టీలకు వెళ్లడం మాత్రమే కాదు.. ఏదైనా సమస్యలు ఉన్నా.. డిప్రెషన్‌లో ఉన్న ఆ అద్దె బాయ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు. వాళ్లు ఒత్తిడ తగ్గించేందుకు సహాయం చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments