Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. యాపిల్ తిని కుర్చీకే పరిమితమైన చిన్నారి?

తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. యాపిల్ తిని కుర్చీకే పరిమితమైన చిన్నారి?
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (11:19 IST)
ఆడుతూ పాడుతూ తిరిగే ఓ చిన్నారి జీవితాన్ని ఒక యాపిల్ ఛిన్నాభిన్నం చేసేసి... అతడిని పూర్తిగా చక్రాల కూర్చీకే పరిమితం చేసేసింది. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ సంఘన వివరాలలోకి వెళ్తే... న్యూజిలాండ్ రొటారులోని రెండేళ్ల బాలుడు నిహాన్ రెనాటా తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. దీంతో వారు రెనాటాను డే-కేర్‌లో వదిలి పెట్టి వెళ్లేవారు. డే-కేర్ సెంటర్‌లోని టీచర్ ఓ రోజు రెనాటాకు యాపిల్ ముక్క ఇచ్చి తినమని చెప్పింది. 
 
అయితే... యాపిల్ ముక్క రెనాటా గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఇబ్బందిపడ్డాడు. ఆ తర్వాత అతడికి గుండె నొప్పి వచ్చింది. దీనితో ఖంగారు పడిన డే-కేర్ సిబ్బంది రెనాటాను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిసేపటి తర్వాత అతడి శరీరంలో కదలిక లేకుండా... కాళ్లు, చేతులు, శరీరంలోని అన్ని భాగాలు చచ్చుపడిపోయి పక్షవాతానికి గురయ్యాడు. 
 
ఊపిరి అందకపోవడంతో రెనాటా బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు తెలిపిన వైద్యులు... రెనాటాను రెండు నెలలపాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించనప్పటికీ... ఫలితం లేకుండా... అప్పటి నుండి వీల్ ‌ఛైర్‌కే పరిమితమయ్యాడు. 
 
ఈ ఘటన 2016వ సంవత్సరంలో చోటుచేసుకోగా... రెనాటాకు ఇప్పుడు ఐదేళ్లు. ఇప్పటికీ అతడు కోలుకోలేదు. భవిష్యత్తులో కోలుకునే అవకాశాలు కూడా చాలా తక్కువేనని అంటున్నారు డాక్టర్లు. 
 
సాధారణంగా మూడేళ్ల కంటే తక్కువ వయస్సు ఉండే చిన్నారులకు యాపిల్ తినిపించకూడదు. ఆ ముక్కలను వారు కొరకలేకపోవడంతో... అవి గొంతులో అడ్డుపడితే రెనాటా తరహాలోనే అస్వస్థతకు గురవుతారు. తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి...?