ఆపిల్ సైడర్ వెనిగర్‌తో కోమలైమన చర్మం, ఒత్తయిన జుట్టు... ఎలాగంటే?

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia

ఆపిల్ సైడర్ వెనిగర్‌తో కోమలైమన చర్మం, ఒత్తయిన జుట్టు... ఎలాగంటే?

Advertiesment
ఆపిల్ సైడర్ వెనిగర్‌తో కోమలైమన చర్మం, ఒత్తయిన జుట్టు... ఎలాగంటే?
, బుధవారం, 20 మార్చి 2019 (20:29 IST)
వెనిగర్‌ను సాధారణంగా వంటలలో వాడతారు అనే విషయం మనందరికి తెలిసిందే. కానీ ఇది అనేక రకాలుగా సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం మరియు జుట్టు నాణ్యతను పెంచి, మరింత అందంగా కనపడేలా చేస్తుంది. అదెలాగో చూద్దాం.
 
1. ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ రెండు గ్లాసుల నీటిలో కలపండి. మిశ్రమాన్ని బాగా కలిపిన తరువాత, కాటన్ బాల్ సహాయంతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. తరువాత కాటన్ బాల్ సహాయంతో ముఖానికి అప్లై చేయండి. మిశ్రమంలో ఉండే సహజంగా అల్ఫా- హైడ్రాక్సీ ఆసిడ్ రక్త ప్రసరణను మెరుగుపరచటమే కాకుండా, ముఖ చర్మంపై ఉండే రంధ్రాలను మరియు చర్మ బిగుతును సరిచేస్తుంది.
 
2. రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్‌లో రెండు కప్పుల నీటిని కలపటం ద్వారా జుట్టును కడిగే మంచి ద్రావణంగా పేర్కొనవచ్చు. నీటితో జుట్టు కడగటం అయిన తరువాత తేలికైన కండిషనర్‌తో వెనిగర్ ద్రావణాన్ని అప్లై చేయండి. మిశ్రమంలో ఉండే ఎసిటిక్ ఆసిడ్ జుట్టుపై ఉండే అవశేషాలను తొలగించి షైనీగా కనపడేలా చేస్తుంది.
 
3. ఆపిల్ సైడర్ వెనిగర్ కలిగి ఉండే యాంటీ -ఫంగల్ గుణాలను చుండ్రుకు వ్యతిరేఖంగా పోరాడతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు నీటిని కలిపి, యాంటీ డాండ్రఫ్ షాంపూను తయారుచేసుకోవచ్చు. షాంపూ లాగానే దీనిని మీ తలపై చర్మానికి మసాజ్ చేయండి.
 
4. ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్నందు వలన చర్మంపై ఏర్పడే చికాకులను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఎసిటిక్ గుణాలు చర్మాన్ని మృదువుగా మార్చి, వెంట్రుకలు పెరిగేందుకు సాయపడుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో పురుషులు వారానికి రెండుసార్లే శృంగారంలో పాల్గొనాలా? ఎందుకు?