Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ చేతుల మీదుగా 'ఆయుష్మాన్ భారత్'కు శ్రీకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో ప్రజారంజక పథకానికి శ్రీకారంచుట్టింది. ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్య సేవలు అందించే నిమిత్తం ఆయుష్మాన్ భారత్ పేరుతో ఓ వైద్య బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (13:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో ప్రజారంజక పథకానికి శ్రీకారంచుట్టింది. ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్య సేవలు అందించే నిమిత్తం ఆయుష్మాన్ భారత్ పేరుతో ఓ వైద్య బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రధాని మోడీ జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించారు. 
 
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సేవల పథకంగా పేరున్న ఆయుష్మాన్ భారత్ - జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (ఏబీ-ఎన్‌హెచ్‌పీఎ) లబ్ధిదారులైన కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తుంది. దాదాపు 10 కోట్ల కుటుంబాలకు చెందిన 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయనుంది. 
 
ఈ పథకానికి అర్హులు ఎవరు?
అయితే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకానికి... పట్టణాల్లో చెత్త వస్తువులను ఏరేవారు, బిక్షగాళ్లు, ఇంటి పని సహాయకులు, వీధి వ్యాపారులు, హాకర్లు, నిర్మాణ రంగ కార్మికులు, తాపీ పనివారు, పెయింటర్లు, వెల్డర్లు, సెక్యురిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు తదితర వర్గాల వారు అర్హులు. రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన పథకం లబ్ధిదారులకూ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది. అర్హులు ఓటరు గుర్తింపు కార్డుతోగానీ, రేషన్‌కార్డుతోగానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ఆధార్ నంబర్ నమోదు తప్పనిసరికాదు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments