Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమ‌ని `అమ్మ దీవెన‌` ప్రారంభం...

ఆమ‌ని కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా `అమ్మ దీవెన‌`. ప‌ద్మ స‌మ‌ర్పిస్తున్నారు. ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. పోసాని కృష్ణ‌ముర‌ళి, అజ‌య్ ఘోష్‌, దినేష్‌, శ‌ర‌త్ చంద్ర కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు ఎత్త‌రి గుర‌వ‌య్య నిర్మాత‌. ప‌ద్మ‌జ నాయు

Advertiesment
ఆమ‌ని `అమ్మ దీవెన‌` ప్రారంభం...
, మంగళవారం, 28 ఆగస్టు 2018 (15:57 IST)
ఆమ‌ని కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా `అమ్మ దీవెన‌`. ప‌ద్మ స‌మ‌ర్పిస్తున్నారు. ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. పోసాని కృష్ణ‌ముర‌ళి, అజ‌య్ ఘోష్‌, దినేష్‌, శ‌ర‌త్ చంద్ర కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు ఎత్త‌రి గుర‌వ‌య్య నిర్మాత‌. ప‌ద్మ‌జ నాయుడు, ఎత్త‌రి చిన‌మార‌య్య ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు. శివ ఏటూరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌రిగింది. ముహూర్త‌పు స‌న్నివేశానికి రాజ్ కందుకూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. బి. గోపాల్ ఫ‌స్ట్ షార్ట్ డైర‌క్ష‌న్ చేశారు. 
 
ఈ సినిమా గురించి ఆమ‌ని మాట్లాడుతూ ``ఇదొక మంచి సినిమా. ఫ్యామిలీలో అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. కుటుంబంలో త‌ల్లి బాధ్య‌త ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని చూపించే సినిమా. పిల్ల‌ల‌ను ఒక స్థాయికి తీసుకురావ‌డానికి త‌ల్లి ఎంత క‌ష్ట‌ప‌డుతుంద‌నే విష‌యాన్ని ఇందులో చ‌క్క‌గా చూపిస్తున్నారు. నిర్మాత‌లు చాలా ధైర్యంగా ముందుకొచ్చారు ఇలాంటి క‌థ‌ను తీయ‌డానికి. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు న‌న్ను క‌లిసి క‌థ చెబుతామ‌ని అన్న‌ప్పుడు ఆలోచించాను. కానీ క‌థ విన్నాక ఏమీ మాట్లాడ‌లేదు. చేస్తాన‌నే అన్నాను. ఇప్ప‌టిదాకా నేను చేసిన పాత్ర‌ల‌తో పోలిస్తే ఇది చాలా డిఫ‌రెంట్ కేర‌క్ట‌ర్‌`` అని అన్నారు.
 
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``క‌థ విన్నాక అంగీక‌రించిన ఆమ‌ని గారికి ధ‌న్య‌వాదాలు. చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్ర‌మిది. మా నిర్మాత‌లకు ధ‌న్య‌వాదాలు`` అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: య‌స్‌.వి.హెచ్‌, డ్యాన్స్: గ‌ణేశ్ స్వామి, ఆర్ట్: పి.వి.రాజు, క‌థ‌: ఎత్త‌రి బ్ర‌ద‌ర్స్. మాట‌లు: శ్రీను.బి., సురేశ్ కుమార్‌.యం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుర్ర హీరో ప్రేమలో ముదురు హీరోయిన్‌ ... బోరున విలపిస్తున్న తండ్రి