Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

ఐవీఆర్
శుక్రవారం, 24 జనవరి 2025 (18:05 IST)
భారతదేశంలో నెంబర్ .1 ఇన్-విట్రో డయాగ్నోస్టిక్ కంపెనీ, వర్ధమాన మార్కెట్‌లపై దృష్టి సారించిన ప్రముఖ గ్లోబల్ IVD ప్లేయర్‌లలో ఒకటైన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్, ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన క్లినికల్ సింపోజియంలో దాని అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌-ఎర్బా హెచ్7100ను పరిచయం చేసింది. ‘క్లినికల్ లాబొరేటరీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి హై-ఎండ్ హెమటాలజీ ఎనలైజర్స్ ఆవశ్యకత’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. డాక్టర్ స్వాతి పాయ్-కన్సల్టెంట్ హెమటోపాథాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్, కీలకోపన్యాసం చేశారు. డాక్టర్ సుశీల కోదండపాణి, సీనియర్ కన్సల్టెంట్ పాథాలజిస్ట్, హెడ్-పాథాలజీ, ఇన్‌ఛార్జ్-క్లినికల్ ట్రయల్స్, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్- రీసెర్చ్ ఇన్స్టిట్యూట్;  డాక్టర్ పరాగ్ పాటిల్, అసోసియేట్ ప్రొఫెసర్, పాథాలజీ & లేబొరేటరీ మెడిసిన్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, AIIMS; డాక్టర్. ఫైక్ అహ్మద్, సీనియర్ కన్సల్టెంట్ పాథాలజిస్ట్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్; డాక్టర్ శ్రీకాంత్ పంకంటి, సీనియర్ కన్సల్టెంట్ పాథాలజిస్ట్, లేబొరేటరీ డైరెక్టర్, కేర్ హాస్పిటల్స్, డాక్టర్ అనురాధ శేఖరన్, డైరెక్టర్- హెడ్-పాథాలజీ- మాలిక్యులర్ పాథాలజీ, AIG హాస్పిటల్స్ కూడా ఈ సింపోజియంలో పాల్గొన్నారు.   
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ, అండాశయ క్యాన్సర్‌లతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరుగుతుంది. అయితే, పురుషులు సాధారణంగా తల, మెడ క్యాన్సర్లు, ప్రోస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్లతో బాధపడుతున్నారు. ఇది అధునాతన హెమటాలజీ ఎనలైజర్ల అవసరాన్ని నొక్కి చెబుతుంది.
 
ఫ్లోరోసెన్స్ ఫ్లో సైటోమెట్రీ సాంకేతికతతో కూడిన ఎర్బా హెచ్7100, రెటిక్యులోసైట్‌లు, ఇమ్మెచ్యూర్ ప్లేట్‌లెట్ ఫ్రాక్షన్(ఐపిఎఫ్), ఇమ్మెచ్యూర్ గ్రాన్యులోసైట్స్ (ఐజి)తో సహా 70-పారామీటర్ శ్రేణిని అందిస్తుంది. రక్తహీనత, థ్రోంబోసైటోపెనియా, ఇన్‌ఫెక్షన్‌లు, ఇన్‌ఫ్లమేషన్, బ్లడ్ క్యాన్సర్‌ల వంటి పరిస్థితులను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి ఈ ప్రమాణాలు అవసరం.
 
డాక్టర్ స్వాతి పాయ్ మాట్లాడుతూ, “దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని విభిన్న జనాభా, ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలకు ఖచ్చితమైన రోగనిర్ధారణ పరిష్కారాలు అవసరం. వీటికి తగిన పరిష్కారాలను ఎర్బా H7100 అందించగలదు. రోగనిర్ధారణ అంతరాలను పరిష్కరించడంలో ఈ ఎనలైజర్ ఒక ముందడుగు, ప్రత్యేకించి తలసేమియా వంటి వంశపారంపర్య రుగ్మతలతో పోరాడుతున్న బలహీన వర్గాలకు ఇది మరింత ఆశాజనకంగా ఉంటుంది" అని అన్నారు. హెమటాలజీ డయాగ్నస్టిక్స్‌లో ఒక పురోగతి, ఎర్బా H7100. వైద్యుల కోసం వేగవంతమైన, నమ్మదగిన పరిజ్ణానం ఇది అందించటం ద్వారా రోగనిర్ధారణ ఖచ్చితత్వం, పరిశోధన సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ఈ ఫీల్డ్‌ను పునర్నిర్వచించనుంది. 
 
ఈ ఆవిష్కరణ పై ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ సురేష్ వజిరాణి మాట్లాడుతూ “ఆవిష్కరణ ద్వారా ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేయడంలో మా నిబద్ధత ఎర్బా హెచ్7100 హెమటాలజీ ఎనలైజర్‌లో ఉదహరించబడింది, ఇది దాని ప్రత్యేక సామర్థ్యాలతో, విస్తృతమైన క్లినికల్, రీసెర్చ్ ప్రమాణాలను అందిస్తుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావటంతో పాటుగా రియాజెంట్ వినియోగం తగ్గిస్తుంది. పెద్ద, మధ్య తరహా ల్యాబ్‌లు, కార్పొరేట్ ఆసుపత్రులు, B2B ల్యాబ్‌లకు అనువైనది. ఎర్బా హెచ్7100 హెమటాలజీ డయాగ్నస్టిక్స్‌లో విప్లవాత్మక మార్పులు చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము, మెరుగైన ఫలితాలను అందించడానికి వైద్యులకు అవసరమైన సాధనాలను ఇది అందజేస్తుంది" అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Balineni: పవన్ కల్యాణ్‌ను కలిసిన బాలినేని.. వైకాపాలో వణుకు

డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ చట్టం.. భారత విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలను?

ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు!!

అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

జపనీస్ యానిమేషన్ చిత్రం రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ- రివ్యూ

తర్వాతి కథనం
Show comments